YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఏపీ కాంగ్రెస్ కు నేతలు కావలెను..?

ఏపీ కాంగ్రెస్ కు  నేతలు కావలెను..?

విజయవాడ, ఆగస్టు 9,
ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ బలోపేతం ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టారు రాహుల్‌ గాంధీ… ఈ నెల 11న ఏపీ కాంగ్రెస్ నేతలతో వరుస భేటీలు జరగనున్నాయి.. 11 వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి విడివిడిగా ఏపీ సీనియర్ నేతలతో ముఖాముఖి సమాలోచనలు జరపనున్నారు రాహుల్ గాంధీ.. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం నుంచి రాష్ట్ర నేతలకు పిలుపు అందింది.. ఆ తర్వాత ఏపీ కాంగ్రెస్‌ పలు కీలక మార్పులు చేర్పులు జరగనున్నాయని తెలుస్తోంది.. పీసీసీ నూతన అధ్యక్షుడు నియామకంపై రాహుల్ చర్చలు జరపనున్నారు.రాష్ట్ర నేతలతో ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై చర్చించనున్నారు రాహుల్ గాంధీ.. పార్టీని బలోపేతం చేసేందుకు రాష్ట్ర నేతల ఆలోచనలు, అభిప్రాయాలను నేరుగా తెలుసుకోనున్న ఆయన.. రాష్ట్ర నేతల అభిమతం తెలుసుకున్న తర్వాత కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.. ఈ నెల 11న హస్తినకు రావాలంటూ.. ఇప్పటికే.. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి డా. చింతా మోహన్, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్ర రావును ఆదేశించింది కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం. కాగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బలంగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీ.. తెలంగాణ ఏర్పాటు తర్వాత తన ప్రభావాన్ని పూర్తిగా కోల్పోయింది.. కష్టసమయంలో మాజీ మంత్రి రఘువీరారెడ్డి లాంటివారు పార్టీ పగ్గాలు తీసుకుని లాక్కొచ్చారు.. ఆ తర్వాత శైలజానాథ్‌ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డిని నియమించడంతో.. పార్టీలో కొత్త ఊపు వచ్చింది.. ఈ నేపథ్యంలో ఏపీలో పార్టీలో జోష్‌ పెంచాలంటే ఏం చేయాలని అనేదానిపై దృష్టిసారించారు రాహుల్ గాంధీ.

Related Posts