YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

బాలారిష్టాలు దాటని కర్నలూ వర్శిటీ

బాలారిష్టాలు దాటని కర్నలూ వర్శిటీ

కర్నూలు, ఆగస్టు 9, 
పాలకుల నిర్లక్ష్యానికి ఉర్దూ యూనివర్సిటీ సాక్షంగా నిలుస్తోంది. ప్యాకల్టీ కొరత, నిధుల లేమీతో కొట్టుమిట్టాడు తోంది. నూతన భవన నిర్మాణాలకు బిల్లులు చెల్లించకపోవ డంతో పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఎనిమిది నెలలుగా అద్దె భవనాలకు కూడా చెల్లింపు చేయలేని దుస్థితి నెలకొంది. నేటికీ యూనివర్సిటీకి రెగ్యులర్‌ విసిని నియమించలేదు. ఉర్దూ సంస్కృతిని, భాషను కాపాడేందుకు మైనార్టీ ప్రజల జీవన సంస్కృతిని ప్రతిబింబించేందుకు డాక్టర్‌ అబ్దుల్‌హక్‌ ఉర్దూ యూనివర్సిటీని 2016 నవంబర్‌ లో కర్నూలులో ఉస్మానియా కాలేజ్‌ కేంద్రంగా ప్రారంభించా రు. ఆరు రకాల డిగ్రీ కోర్సులు, ఏడు పిజి కోర్సులను అందిస్తోంది. అయితే ఆది నుంచి కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి.144 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టనున్న నూతన భవన నిర్మాణానికి బిల్లులు చెల్లించకపోవడంతో నిర్మాణ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. అకాడమీ బిల్డింగ్‌, బార్సు, గర్ల్స్‌ హాస్టళ్లు, అంతర్గత రోడ్ల పనులకు రూ.20 కోట్లు అవసరముందని ప్రతిపాదనలు పంపినా ప్రభుత్వం నిధులను విడుదల చేయలేదు. 2018లో కర్నూలు కార్పొరేషన్‌ పరిధిలోని అద్దె భవనాలకు తరగతులను మార్చారు. యూనివర్సిటీ పరిపాలన విభాగానికి సంవత్సరానికి దాదాపు రూ.67.20 లక్షలు అవసరం ఉండగా ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో ఎనిమిది నెలలుగా అద్దె భవనాలకు చెల్లింపులే చేయలేదు. ప్రస్తుతం యూనివర్సిటీలో టీచింగ్‌, నాన్‌-టీచింగ్‌ ఫ్యాకల్టీ కాంట్రాక్ట్‌ పద్ధతిలో కొనసాగుతున్నారు. విద్యార్థుల సంఖ్యకు తగినట్లుగా రెగ్యులర్‌ ప్రొఫెసర్ల నియామకం చేపట్టడం లేదు. ఎంబిఎ, ఎంఎస్‌సి వంటి ఉన్నతమైన కోర్సుల ఫ్యాకల్టీ జీతభత్యాలకు సంవత్సరానికి రూ.1.74కోట్లు అవసరం ఉండగా ప్రభుత్వం రూ.92.50లక్షలను మాత్రమే విడుదల చేస్తోంది. దీంతో సిబ్బందికి వేతనాలు చెల్లించడం కూడా భారంగా మారింది. రెగ్యులర్‌ పోస్టుల నియామకం కోసం గతంలో 35 పోస్టులకు ప్రతిపాదనలు పంపారు. ఈ ప్రభుత్వం 21 పోస్టులను మాత్రమే అనుమతిస్తూ వాటిని కూడా జాబ్‌ క్యాలెండర్‌ ద్వారా నియమించేందుకు సన్నాహాలు చేపట్టింది.సైన్స్‌ విద్యార్థులకు ల్యాబ్‌ సౌకర్యం లేక ఇతర కళాశాలల్లో ప్రాక్టికల్స్‌ చేయాల్సి వస్తోంది. యూనివర్సిటీలో నూతన కోర్సులకు కూడా అడుగులు పడటం లేదు. ఇంటిగ్రేటెడ్‌ లా కోర్సు, ఎంఎస్‌సి కెమిస్ట్రీ వంటి నూతన కోర్సులకు ప్రతిపాదనలు పంపి సంవత్సరాలు గడుస్తున్నా ఉన్నత విద్యా మండలి నేటికీ ఆమోదం తెలపలేదు. ఉర్దూ యూనివర్సిటీకి ఇప్పటి వరకూ రెగ్యులర్‌ విసిని నియమించలేదు. ప్రస్తుతం ఉన్నత విద్యా శాఖ కమిషనర్‌ సతీష్‌ చంద్ర విసిగా వ్యవహరిస్తున్నారు. ఉర్దూ విద్యకు ప్రాథమిక స్థాయి నుంచి సరైన సౌకర్యాలు అందడం లేదు. పేరుకు మండలానికి ఒక ఉర్దూ ప్రాథమిక పాఠశాలలు ఉన్నా సరైన భవనాలు, సిబ్బంది లేరు. ఉన్నత పాఠశాలలు డివిజన్‌ కేంద్రాలకే పరిమితం కావడంతో 60 శాతానికిపైగా ఉర్దూ విద్యార్థులు ప్రాథమిక విద్యతోనే చదువు మానేస్తున్నారు.కర్నూలు జిల్లాలోనే దాదా పు 200 మంది మాత్రమే ఉర్దూ మీడియంలో ఇంటర్మీడియ ట్‌ విద్యను అభ్యసిస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు

Related Posts