YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

శ్రావణం నుంచి దసరాకు సీన్

శ్రావణం నుంచి దసరాకు సీన్

హైదరాబాద్, ఆగస్టు 9, 
తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ ఇప్పట్లో జరిగేలా కన్పించడం లేదు. తొలుత శ్రావణ మాసంలో కేసీఆర్ తన మంత్రివర్గాన్ని విస్తరించాలని భావించారు. అన్నీ ఎన్నికలు అయిపోవడంతో మంత్రివర్గాన్ని విస్తరించి వచ్చే ఎన్నికలకు సమాయత్తం చేయాలనుకున్నారు. ఎన్నికల కేబినెట్ ను ఈ శ్రావణమాసంలో ఏర్పాటు చేయాలని కేసీఆర్ భావించారు. అయితే ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణకు అవకాశాలు లేవు.ఈటల రాజేందర్ ఎపిసోడ్ లో మంత్రి వర్గ విస్తరణ మరింత వాయిదా పడే అవకాశముంది. హుజూరాబాద్ ఉప ఎన్నిక పూర్తయ్యేంత వరకూ మంత్రి వర్గ విస్తరణ ఉండదని కేసీఆర్ సంకేతాలు ఇచ్చినట్లు తెలిసింది. మంత్రి వర్గ విస్తరణపై అనేకమంది ఆశలు పెట్టుకున్నారు. ఎమ్మెల్సీలతో పాటు, పలువురు సీనియర్ నేతలు కూడా ఈసారి విస్తరణలో తమకు అవకాశం దక్కుతుందని ఆశించారు.కానీ ఎప్పటికప్పడు ఏదో ఒక ఎన్నిక రావడం వాయిదా పడుతుండటం సాధారణమయింది. గతంలో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక తర్వాత కేసీఆర్ మంత్రివర్గాన్ని విస్తరించాలనుకున్నారు. కానీ ఆ తర్వాత ఈటల రాజేందర్ వ్యవహారంతో మరోసారి వాయిదా వేయాల్సి వచ్చింది. ఇప్పుడు మంత్రి వర్గ విస్తరణ కన్నా హుజూరాబాద్ లో గెలుపు కేసీఆర్ కు అత్యంత ప్రాధాన్యం. అందుకే ఉప ఎన్నికపైనే కేసీఆర్ ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు.అయితే మంత్రి వర్గ విస్తరణ వాయిదా పడుతుండటంతో కొందరు మంత్రులు ఊపిరి పీల్చుకుంటున్నారు. తమ పదవి మరికొద్దినెలలు పదిలం అని భావిస్తున్నారు. మంత్రివర్గ విస్తరణ జరిగితే నలుగైదుగురిని కేసీఆర్ తప్పించే అవకాశముంది. అనేక ఆరోపణలు వచ్చిన మల్లారెడ్డి వంటి వారిని ఇంకా మంత్రివర్గంలో కొనసాగిస్తుండటంపై విమర్శలు విన్పిస్తున్నాయి. ఇలాంటి వారు మాత్రం మంత్రి వర్గ విస్తరణ వాయిదాతో సంబర పడుతున్నారు. మొత్తం మీద హుజూరాబాద్ ఉప ఎన్నిక తర్వాతే మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్నది లేటెస్ట్ అప్ డేట్.
మరొ వైపు నేతలు మాత్రం
హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రత్యర్థిగా ఉన్న ఆ నాయకుడిని ఉమ్మడి జిల్లా టీఆర్ఎస్ పార్టీ నాయకులు మర్చిపోలేకపోతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్.. ఈటల రాజేందర్ ను ఓడించేందుకు ఎత్తులకు పై ఎత్తులు వేస్తుంటే ఈ నాయకులు మాత్రం ఇంకా తమ ముఖ్య నాయకుల్లో ఒకరని చెప్పుకుంటున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోటో జగిత్యాల, కరీంనగర్ జిల్లాల్లో హాట్ టాపిక్‌గా మారింది. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల అధ్యక్షురాలు ఎం. స్వర్ణలత, ఆమె భర్త రాజనర్సింగరావు శనివారం సోషల్ మీడియాలో ఓ పోస్టు చేశారు. జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీ తయారు చేయించి సోషల్ మీడియాలో పోస్ట్ వేశారు. ఇందులో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్.. మాజీ మంత్రి ఈటల రాజేందర్, మరో మంత్రి కొప్పుల ఈశ్వర్, స్టేట్ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డిలో ఫోటోలు ముద్రించారు. ఇది వైరల్ గా మారింది.

Related Posts