YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఇక రాకలే.. పోకడలు లేవు

ఇక రాకలే.. పోకడలు లేవు

హైదరాబాద్, ఆగస్టు 9,
తెలంగాణ కాంగ్రెస్ లో నిన్నమొన్నటి వరకూ పోకలే తప్ప రాకలు ఎరగం. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా అనే వార్త గత ఏడేళ్ల నుంచి సర్వసాధారణంగా మారింది. నేతలు పట్టించుకోరు. నిలువరించరు. కాంగ్రెస్ ఇక కోలుకోలేదని భావించిన కీలక నేతలందరూ అధికార టీఆర్ఎస్ లోకి, మరికొందరు బీజేపీలోకి జంప్ అయ్యారు. దీంతో కాంగ్రెస్ బలహీనంగా కన్పించడంతో పాటు బీజేపీ బలోపేతమయిందన్న భ్రమ నెలకొంది. కాంగ్రెస్ ఇక కోలుకోవడం కష్టమేనన్న భావన సర్వత్రా నెలకొంది.గత ఎన్నికలకు ముందు కొండా సురేఖ దంపతుల చేరిక తర్వాత కాంగ్రెస్ లో ఇప్పటి వరకూ చేరికలు లేవు. ప్రతి ఎన్నిక జరగడం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం అలవాటుగా మారింది. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత పార్టీ పెద్దలపై ఆరోపణలు చేస్తూ రాములు నాయక్ రాజీనామా చేశారు. ఇలా ఎన్నికలు వచ్చినప్పుడల్లా రాజీనామాల మాట విన్పించక తప్పట్లేదు. అయితే రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా బాధ్యతలను చేపట్టిన తర్వాత కొంత కంట్రోల్ అయిందనే చెప్పాలికాంగ్రెస్ లో జోష్ నింపాలంటే చేరికలకే ప్రాధాన్యం ఇవ్వాలన్నది రేవంత్ రెడ్డి ఆలోచన. వెళ్లిపోయిన నేతలను తిరిగి కాంగ్రెస్ గూటికి రప్పించే పనిలో రేవంత్ రెడ్డి ఉన్నారు. అలాగే టీడీపీలో తనకు సంబంధాలున్న నేతలను కూడా రేవంత్ రెడ్డి వదిలిపెట్టడం లేదు. దేవేందర్ గౌడ్ కుమారుడు వీరేంద్రను కాంగ్రెస్ పార్టీలోకి రావాలని రేవంత్ రెడ్డి ఆహ్వానించడమే ఇందుకు ఉదాహరణ. మరికొందరు టీడీపీ నేతలు సయితం కాంగ్రెస్ లోకి వచ్చే అవకాశముందని తెలుస్తోంది.తెలుగుదేశం, బీజేపీతో పాటు అధికార టీఆర్ఎస్ లో అసంతృప్తిగా ఉన్న నేతలను ఆకర్షించే పనిలో పడ్డారు రేవంత్ రెడ్డి. ఈ మేరకు కొందరు నేతలు రేవంత్ రెడ్డితో టచ్ లోకి వచ్చినట్లు తెలుస్తోంది. హుజూరాబాద్ ఎన్నిక లోపే వీలయినంత మందిని పార్టీలోకి చేర్చుకుంటూ జోష్ నింపాలన్నది రేవంత్ రెడ్డి ప్రయత్నంగా ఉంది. ఉనికి కోల్పోతుందని భావించిన కాంగ్రెస్ కు చేరికలతో ప్రాణం పోయాలన్న రేవంత్ రెడ్డి ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాల్సి ఉంది.

Related Posts