నెల్లూరులోని పోలీస్ శిక్షణ కళాశాలలో పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హాజరైయారు. తరువాత కవాతులో గౌరవవందనం స్వీకరించారు.జ ఈ కార్యక్రమంలో ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ, పీటీసీ ప్రిన్సిపల్ శరత్ బాబు, ఇతర అధికారులు పాల్గోన్నారు. మంత్రి మాట్లాడుతూ పోలీస్ ఉద్యోగం సమాజంలో కీలకమైనది..ప్రతి పౌరుడికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని అన్నారు. శిక్షణ పొందిన కానిస్టేబుళ్లలో ఉన్నత విద్యావంతులు కూడా ఉండటం అభినందనీయం. అంకితభావంతో పనిచేయడంతో పాటు ప్రజలతో ఓపికగా, స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ బాధ్యతలు నిర్వర్తించాలని సూచించారు. రక్షణ కోరి వచ్చిన వారి బాధలను అర్ధం చేసుకుని కాపాడాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. ప్రజలకు రక్షణ కల్పించి వారి హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోవాలని అన్నారు. శిక్షణ పొంది వెళుతున్న ప్రతి కానిస్టేబుల్ కి మంచి భవిష్యత్ ఉండాలని ఆకాంక్షిస్తున్నానని మంత్రి అన్నారు.