YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

14న రెండు వేల కిలోమీటర్ల జగన్ యాత్ర

14న  రెండు వేల కిలోమీటర్ల జగన్ యాత్ర

విపక్ష నేత జగన్ పాదయాత్ర ఈ నెల పద్నాలుగుకు రెండువేల కిలోమీటర్ల మైలు రాయి దాటనుంది. ఆ సంగతిని ఘనంగా చెప్పేందుకు పావులు కదుపుతోంది వైసీపీ. కీలక నేతలు సమావేశమై పాదయాత్రను మరింతగా ప్రచారం చేసేందుకు సిద్దమవుతున్నారు.జగన్ పాదయాత్రకు మిశ్రమ స్పందన వస్తోంది. కొన్ని చోట్ల అనూహ్య స్పందన వస్తోంది. కృష్ణా జిల్లాలో అడుగు పెట్టిన రోజు రెండున్నర కిలోమీటర్ల పొడవున బ్రిడ్జి పట్టలేదు. అంతగా జనం వచ్చారు. ఆ స్పందన చూసి వైకాపా శ్రేణుల్లో ఉత్సాహం వచ్చింది. యలమంచిలి రవి పార్టీలో చేరడంతో ఆయన అనుచరులు వచ్చారంటున్నారు. మరోవైపు భారీగా జనాలను తరలించారంటారు. ఎంతగా జనాలను తరలించినా అంత పెద్ద స్థాయిలో రావడం వారిలో ఉత్సాహం నింపుతోంది. ఇప్పుడు @2000 కి.మీ యాత్రను అదే స్థాయిలో నిర్వహించేందుకు వారు సిద్దమవుతున్నారు. మరోవైపు వారికి విరుగుడుగా టీడీపీ ఏం చేస్తుందో చూడాలి. జాతీయ మీడియాను పిలిపించే పని చేస్తున్నారు. అవసరమైతే వారికి కొంత మొత్తంలో ఇచ్చి ప్రచారం బాగా వచ్చేలా చూడాలనే ఆదేశాలు వచ్చాయి. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవ. అంతే మీడియా యజమానులకు వర్తమానం అందింది. అవసరమైతే ప్యాకేజి పద్దతిలో వారికి ఇచ్చేందుకు సిద్దమయ్యారంటున్నారు. ఇప్పటికే ప్రచారం బాగా తగ్గింది. కాబట్టి బయట పడకుండా ప్రచారం చేసేలా చూడాలనే వాదన వచ్చింది. 

మరోవైపు జగన్ కు సంఘీభావంగా రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు చేయాలని ఆ పార్టీ నిర్ణయించింది. నాలుగేళ్లలో టీడీపీ సర్కార్ చేసిన, చేస్తున్న వైఫల్యాలను, ఎన్నికల హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లే పని చేయనుంది వైసీపీ. ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని చెబుతూనే ఈ నెల 14, 15 తేదీల్లో రెండు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులు పాదయాత్రలు చేయనున్నాయి. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం జగన్‌ యాత్ర చేస్తున్న సంగతిని వారికి వివరించనున్నారు. రెండు రోజుల పాదయాత్ర తర్వాత 16న 13 జిల్లాల్లో కలెక్టర్‌లకు పార్టీ తరపున వినతి పత్రాలను ఇవ్వనుంది వైకాపా. అంతే కాదు… ఆ పార్టీ నేతలు, శ్రేణులు కలెక్టర్‌ కార్యాలయాల వద్ద బహిరంగ సభలు నిర్వహించనున్నారు. జగన్‌ 2000 కిలోమీటర్ల పాదయాత్రను సంబరంగా జరపడమే కాదు.. ఏపీకి హోదాతో పాటు.. మిగతా అంశాలను ప్రజల వద్దకు తీసుకుపోనుంది.

Related Posts