YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహించాలి

క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహించాలి

నెల్లూరు
క్రీడలను మరియు క్రీడాకారులను ప్రోత్సహించాలని  నెల్లూరు జిల్లా  నెహ్రూ యువకేంద్ర  కోఆర్డినేటర్ ఆకుల మహేందర్ రెడ్డి పేర్కొన్నారు .  నెల్లూరు నగరంలోని స్థానిక స్వతంత్ర పార్కులో సోమవారం గౌతమబుద్ధ వాకర్స్ అసోసియేషన్ నిర్వహించిన టోక్యో ఒలింపిక్ క్రీడల్లో విజయం సాధించిన భారతీయ క్రీడాకారుల అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛంద సంస్థలు , ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు క్రీడలను ప్రోత్సహించాలన్నారు.
టోక్యో ఒలింపిక్స్‌ విజేతలకు   అభినందనలు తెలియజేసిన గౌతమ బుద్ధ వాకర్స్ అసోసియేషన్   అధ్యక్షులు జయప్రకాష్ మరియు   ప్రధాన కార్యదర్శి అరవ రాయప్ప. టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రోలో బంగారు పతకం సాధించిన నీరజ్ చోప్రా మరియు ఇతర భారత్ పతక విజేతలను అభినందించారు.  మన దేశం నుండి అథ్లెటిక్స్‌లో తొలి ఒలింపిక్ బంగారు పతకాన్ని సాధించడం ద్వారా నీరజ్ చోప్రా ప్రతి భారతీయుడిని గర్వపడేలా చేశారు అని అన్నారు. భవిష్యత్తులో ఇతను మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నామన్నారు.  మనదేశం గర్వ పడేలా ఉత్తమ  ప్రతిభ కనబరచి, ఒలింపిక్ పతకాలు సాధించిన కుస్తీలో కాంస్య పతకం సాధించిన బజరంగ్ పునియా, రెజ్లర్ (57 కేజీ) రవి కుమార్ దహియా (సిల్వర్), వెయిట్ లిఫ్టర్ మీరాబాయ్ చాను (సిల్వర్), షట్లర్ పివి సింధు (కాంస్యం), వెల్టర్-వెయిట్ బాక్సర్ లోవ్లినా బోర్గోహైన్ (కాంస్యం) మరియు భారత హాకీ జట్టు (కాంస్యం)లకు అభినందనలు తెలుపుతూ, వారి విజయం యువ క్రీడాకారులను ప్రోత్సహాన్ని, మన దేశానికి గొప్ప పురస్కారాలు మరియు గౌరవాన్ని తీసుకురావలన్న స్ఫూర్తిని వారికిస్తుందని అన్నారు. యువత , విద్యార్థులు క్రీడల్లో చురుకుగా పాల్గొనేలా  తల్లిదండ్రులు , కేంద్రం , రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టులు  నయీం ఖాన్  పి. నాగరాజులను ఘనంగా సత్కరించారు. రోగ నిరోధక శక్తిని పెంచే ఆనందయ్య  మందును సతీష్ అందజేశారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ కోశాధికారి రామ్మోహన్ ఉపాధ్యక్షుడు బండి  ప్రసాద్  అల్లూరి సీతారామరాజు వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు రమాదేవి పీఎంపీ అసోసియేషన్ అధ్యక్షుడు వేణుగోపాల్ సీనియర్ జర్నలిస్ట్ కే .దయ శంకర్. నెల్లూరు జిల్లా రచయితల సంఘం జాయింట్ సెక్రటరీ డీటీ హరికృష్ణ,  రూట్స్ చైర్మన్ రసూల్,  రాజేష్,  నారాయణ  తదితరులు పాల్గొన్నారు.

Related Posts