నెల్లూరు
భారతదేశంలోని ప్రభుత్వ రంగ సంస్థల్లో ఒకటైన కెనరా బ్యాంకు, 4 వ స్థానం నుంచి 3వ స్థానం కైవసం చేసుకుంది. దీని యొక్క గ్లోబల్ వ్యాపారం 17.06 లక్షల కోట్లతో ఈ యొక్క అచీవ్మెంట్ సాధ్యమైంది. ఈ శుభ సందర్భంగా కెనరా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంబరాన్నంటిన సంబరాలు జరిగాయి. ఈ సందర్భంగా కెనరా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జీ.వి. మనిమరాన్ అధ్యక్షతన నెల్లూరు జిల్లా , గొలగమూడి బ్రాంచ్ లో ఆయన చేతుల మీదగా కేక్ కట్ చేయడంతో సంబరాలు మిన్నంటాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే కాలంలో కెనరా బ్యాంకు ఉన్నత శిఖరాలను అధిగమించాలని, వినియోగదారులకు నాణ్యమైన , నమ్మకమైన విస్తృతమైన బ్యాంకు సేవలను అందించేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు . ఈ సందర్భంగా కెనరా బ్యాంక్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎల్ వి ప్రభాకర్ కి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. బ్యాంక్ అభివృద్ధికి, కార్యక్రమ నిర్వహణకు సహకరించిన బ్యాంకు సిబ్బంది అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కెనరా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జీ.వి .మని రామన్ ను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో లీడ్ బ్యాంక్ డిస్ట్రిక్ట్ మేనేజర్ వై వి రాంప్రసాద్ రెడ్డి, రీజినల్ సెక్రటరీ వీరేంద్ర నాథ్ రెడ్డి, ఓబీసీ రీజినల్ సెక్రటరీ బత్తల నవీన్ కృష్ణ యాదవ్, బ్రాంచ్ మేనేజర్ సురేష్, సభ్యులు చైతన్య, ప్రదీప్, సాయి. శివ తదితరులు పాల్గొన్నారు.