YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

నీటి కాలువలో శివుని విగ్రహం ప్రత్యక్షం

నీటి కాలువలో శివుని విగ్రహం ప్రత్యక్షం

నెల్లూరు
నెల్లూరు జిల్లా, పొదలకూరు పట్టణంలో అద్భుతం జరిగింది. పట్టణంలోని నీటి కాలువలో శివుడి ప్రత్యక్షం కావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో స్థానికులు పెద్ద ఎత్తున విగ్రహానికి చూడడానికి ఆసక్తి చూపించారు. శ్రావణ మాసం ప్రారంభమైన వేళ, అందులోనూ శివుడికి ఎంతో ప్రీతిప్రాతమైన సోమవారం రోజున శివుడి విగ్రహం ఇలా కనిపించడంతో భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది కచ్చితంగా ఆ దేవదేవుడి మహిమే అంటూ పూజలు చేయడం ప్రారంభించారు.
ఇదిలా ఉంటే ఈ నీటి కాలువలో దేవతా మూర్తుల విగ్రహం బయటపడడం ఇదే తొలిసారి కాదు. 21 రోజుల క్రితం ఇదే నీటి కాలువలో గంగమ్మ విగ్రహం కూడా బయటపడింది. ఇలా తక్కువ వ్యవధిలో గంగ-శివుడి విగ్రహాలు ప్రత్యక్షం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. నీటి ప్రవాహంలో నాలుగు అడుగుల విగ్రహం అందరినీ ఆకట్టుకుంటోంది. నీటి ప్రవాహం ఉదృతంగా ఉన్నప్పటికీ విగ్రహం కదళపోవడం విశేషం.  ఈ విగ్రహాలు చూస్తుంటే పురాతన కాలానికి చెందినవిగా కనిపిస్తున్నాయి. దీంతో ఆ ప్రాంతంపై అందరి దృష్టి పడింది. ఈ విగ్రహాలు కాలువలోకి ఎక్కడి నుంచి వచ్చాయన్న విషయం తెలియాల్సి ఉంది.  ఈ ప్రాంతంలో తవ్వకాలు చేస్తే చరిత్రకు సంబంధింన ఆనవాళ్లు ఏమైనా బయటపడొచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. గంగమ్మ ఒడిలో శివుడు సేదతీరుతున్నట్లు భక్తులు ఆనందపడిపోతున్నారు.

Related Posts