విశాఖపట్నం
విశాఖలో కూల్చివేతల పర్వం కొనసాగుతోంది. రుషికొండలో ఏపీటీడీసీ బీచ్ రిసార్ట్స్‌ను కూల్చివేస్తున్నారు. దీనిపై టీడీపీ ఆధ్వర్యంలో స్థానికులు నిరసన చేపట్టారు.కూల్చివేతలు నిలిపివే యాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ ప్రాంతంలో 91 కోట్లతో కొత్త రిసార్ట్స్ నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 14 ఏళ్ల క్రితం 15 కోట్లతో ఈ రిసార్ట్స్‌ను నిర్మించారు. ఇది 60 గదులతో, 30 కోట్ల టర్నోవర్‌తో పలువురికి ఉపాధి లభిస్తోంది. ఇప్పు డు ప్రభుత్వం కూల్చివేయడంతో వారంతా ఉపాధి కోల్పోతున్నారని టీడీపీ నేతలతోపాటు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఉపాధి కోల్పోతున్నారని,జగన్ ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని మాజీ మంత్రి బండారు సత్యనారా యణ అన్నారు.