YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కోర్టు ధిక్కార కేసు…హైకోర్టుకు హాజరైన నలుగురు ఐఏఎస్ లు

కోర్టు ధిక్కార కేసు…హైకోర్టుకు హాజరైన నలుగురు ఐఏఎస్ లు

అమరావతి
కోర్టు ధిక్కార కేసులో నలుగురు ఐఏఎస్ లు హైకోర్టుకు హాజరయ్యారు. పంచాయతీ ప్రిన్సిపల్ సెక్రెటరీ ద్వివేది,  కమిషనర్ గిరిజాశంకర్, పురపాలక శాఖ సెక్రటరీ శ్రీ లక్ష్మి,  విజయ్ కుమార్ లు హజరయ్యారు. పాఠశాలల భవనాలలో రైతు భరోసా కేంద్రాలు, పంచాయతీ భవనాలు, గ్రామ సచివాలయం నిర్మాణం పై హై కోర్టులో దిక్కర  కేసు విచారణ జరిగింది. స్కూల్ ఆవరణలో భవనాలు నిర్మించవద్దని ఇచ్చిన ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారని  ధర్మాసనం వ్యాఖ్యానించింది. పేద పిల్లలు చదువుకునే స్కూల్ లో వాతావరణం కలుషితం చేస్తున్నారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎవరైనా ఈ పాఠశాలలో చదువుకున్నారు అని  హైకోర్టు జడ్జి దేవానంద్ ప్రశ్నించారు. హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినా నిర్మాణాలు ఎందుకు కొనసాగుతున్నాయని న్యాయమూర్తి ప్రశ్నించారు. పాఠశాల ఆవరణ లోకి రాజకీయాలు తీసుకెళ్తారని ప్రశ్నించింది. తదుపరి విచారణను ఆగస్టు 31కి వాయిదా వేసింది. ఆగస్టు 31న కూడా అధికారులంతా హాజరుకావాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. ఏజీ మాట్లాడుతూ అన్ని విషయాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి నివేదిక ఇస్తామని కోర్టుకు నివేదించారు.

Related Posts