YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

బీజేపీ బస్సు యాత్ర

బీజేపీ బస్సు యాత్ర

బీజేపీ విచిత్రమైన లాజిక్ చెబుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం ఖాయమని జోస్యం చెబుతోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ఈ కొత్త వాదన అందరి ముందు ఉంచారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుజాతి కెరటం, అన్న ఎన్టీఆర్‌ను ఉదాహరణగా చెబుతూ లక్ష్మణ్ కొత్త ప్రస్తావన చేశారు. ఎన్టీఆర్ నేషనల్ ఫ్రంట్ పేరుతో గతంలో జాతీయస్థాయిలో చక్రం తిప్పారు. ఆ తర్వాత ఏపీలో జరిగిన ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. 2019 ఎన్నికల్లో కేసీఆర్‌కు అదే పరిస్థితి వస్తుందన్నారు. రాష్ట్రాన్ని వదిలిపెట్టి జాతీయ రాజకీయాలకు వెళితే అసలుకే మోసం వస్తుందని చెప్పారు. అందుకు ఎన్టీఆర్ కు జరిగిన పరాజయాన్ని గుర్తు చేశారాయన. 

ఇంకో ఆశ్చర్యకమైన సంగతి ఎంటంటే… కాంగ్రెస్ తోక పార్టీ టీఆర్ఎస్ అని చెప్పారు. తెలంగాణలో టీఆర్ఎస్ గానీ లేక కాంగ్రెస్ గానీ అధికారంలోకి వచ్చే వీలుంది. బీజేపీకి అంత సీన్ లేదని చాలా సర్వేలు చెబుతున్నాయి. అలాంటి సమయంలో బీజేపీ చాలా ధీమాగా ఉంది. రాబోయే కాలంలో తెలుగు రాష్ట్రాల్లో తమదే అధికారం అని చెబుతోంది. తెలంగాణలో మెజార్టీ సీట్లు మావేనంటోంది. అలా చెప్పకపోతే క్యాడర్ నీరుగారిపోదు. అందుకే అలా చెబుతున్నామంటున్నారు అంతర్గతంగా ఆ పార్టీ నేతలు. కానీ బాహాటంగా మాత్రం కోతలు కోస్తున్నారు. ప్రజలను ఆకట్టుకునేందుకు అధికారంలోకి వచ్చేందుకు తెలంగాణలో కాంగ్రెస్ బస్సు యాత్రలు చేస్తోంది. ఫలితంగా ప్రజల్లో చర్చ సాగుతోంది. అందుకే తాము తక్కువ కాదంటున్నారు కమలం నేతలు. బస్సు యాత్రలు చేసేందుకు సిద్దమయ్యారు. వచ్చే జూన్ నుంచి బీజేపీ బస్సు యాత్ర ఉంటుంది. మొత్తం 50 నియోజకవర్గాల్లో సభలు ఉంటాయి. రానున్న ఎన్నికల్లో గెలిచేందుకు ఈ సభలు దోహదం చేస్తాయని బీజేపీ భావిస్తోంది. కేంద్ర మంత్రులను పలు సభలకు ఆహ్వానించి మాట్లాడించనుంది.  కాంగ్రెస్‌తో సంబంధాలున్న పార్టీ నేతలతో కేసీఆర్ కలవడం వెనుక అసలు సంగతి ఇదేనన్నారు బీజేపీ నేత. కేసీఆర్ పర్యటనలు మొత్తం కాంగ్రెస్‌కు లాభం చేకూర్చేలా ఉన్నాయని ప్రస్తావించారు. ప్రధాని మోడీకి అనుకూలంగా కేసీఆర్ ఉన్నారని ఒక వర్గం వాదిస్తుంటే.. కాదు కాదు కాంగ్రెస్ కు మేలు చేకూర్చేలా ఆయన వ్యవహరిస్తున్నారని బీజేపీ అంటోంది. రాహుల్ గాంధీతో మాట్లాడి వారిని కలుస్తున్నారని కొత్త వాదన తెరపైకి తెచ్చారు లక్ష్మణ్. 

Related Posts