YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ

స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలి

స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలి

ఆగస్ట్ 09
పునరుద్దరిస్తున్న రామగుండం ఎరువుల కర్మాగారంలో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని, ఫ్యాక్టరీ నుండి విష వాయువులు వెలువడకుండా సరైన రక్షణ చర్యలు చేపట్టాలని కోరుతూ కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి భగవoత్ ఖుబా కు రామగుండం శాసన సభ్యులు కోరుకంటి చందర్ లేఖ సమర్పించారు. ఎంఎల్ఎ స్థానికంగా లేకపోవడంతో రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్, డిప్యుటీ మేయర్ నడిపల్లి అభిషేక్ రావు ఈ లేఖలను పెద్ద పల్లి పార్లమెంట్ సభ్యులు బోర్లకుంట వేంకటేష్  నేత సమక్షంలో కేంద్ర రసాయనాలు , ఎరువుల శాఖ సహాయ మంత్రి భగవoత్ ఖుబాకు ఎన్టిపిసి జ్యోతి భవన్ లో సోమవారం  అందజేశారు. నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను తెలంగాణ రాస్ట్రేతరులకు కాకుండా జిల్లా ఉపాధి కల్పనా కేంద్రం ద్వారా స్థానికులకే ఇచ్చి స్థానిక నిరుద్యోగులకు న్యాయం జరిగేలా చూడాలని, అలాగే ఎఫ్సిఐ మాజీ ఉద్యోగుల పిల్లలకు 50 శాతం ఉద్యోగాలు కేటాయించాలని కోరారు. ఇటీవల అమోనియా లీకేజీ, ఫ్యాక్టరీ నుండి దుర్వాసనలు రావడం, కలుషిత నీరు బయటకు వదలడం తదితర సంఘటనలు చోటు చేసుకున్నాయని ఇలాంటివి పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవడంతో పాటు ఇట్టి విషయంలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఫ్యాక్టరీలో అగ్ని మాపక దళంతో కూడిన సిఐఎస్ఎఫ్ సిబ్బంది సేవలను ఉపయోగించుకోవాలని  డిపార్టుమెంటల్ ఆసుపత్రిని అలాగే  కేంద్రీయ విద్యాలయాన్ని పునరుద్దరించాలని కోరారు. నాయకులు తానిపర్తి గోపాల రావు మేయర్ వెంట ఉన్నారు.

Related Posts