YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కార్మిక హక్కులు చట్టాలు అమలు చేయాలి

కార్మిక హక్కులు చట్టాలు అమలు చేయాలి

విశాఖపట్నం
కార్మిక హక్కులు చట్టాలు కాపాడాలని, వ్యవసాయ నల్లచట్టాలురద్దు చేయాలని, కార్మికులకు కనీస వేతనం 21వేలు ఇవ్వాలని, ఉద్యోగులకు,కార్మికులకు పనిభద్రత కల్పించాలని, స్కీం వర్కర్లలకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, విశాఖ స్టీల్ ప్లాంట్ తో సహా ప్రభుత్వ రంగాన్ని కాపాడాలని, నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని, ప్రపంచ ఆదివాసి దినోత్సవం వర్ధిల్లాలని, గిరిజన హక్కుల చట్టాలు కాపాడాలని, సిఐటియు,గిరిజనసంఘం, మహిళాసంఘం ప్రజాసంఘాల ఆధ్వర్యంలో అరకులోయలో ర్యాలీ నిర్వహించి తాసిల్దార్ కార్యాలయంలో  నిరసన తెలిపారు ఎన్నో ఏళ్లుగా కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాస్తూ నాలుగు లేబర్ కోడ్లు చట్టాలు తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం కార్మికులకు సంఘం పెట్టుకునే హక్కు, కనీస వేతనం, ఉద్యోగ భద్రత హక్కులకు చేటు తెచ్చే విధంగా ఉన్నాయని, రైతు వ్యతిరేక చట్టాలు, విద్యుత్ సవరణ బిల్లు రద్దు చేయాలని, పంటలకు మద్దతు ధర చట్టం తేవాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ ఆపాలని, పెట్రోల్, డీజిల్, నిత్యవసర వస్తువుల ధరలు తగ్గించాలని, తెల్లరేషన్ కార్డుఉన్న కుటుంబానికి ప్రతినెలా 7500 చొప్పున ఇవ్వాలని, ఉపాధి హామీ నిధులు పెంచి 200 రోజులు పనిదినాలు కల్పించి 600రూ రోజుకుఇవ్వాలని స్కీం వర్కర్లకు అంగన్వాడి, ఆశ, మిడ్ డే మీల్స్, వివోఏ లకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, పంచాయతీ, జి సిసి సోప్ యూనిట్, ఆసుపత్రి పారిశుధ్య కార్మికులు, ఐటిడిఎ కార్మికులకు, కనీస వేతనం అమలు చేయాలని, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని,కరోనా నియంత్రణలో కృషి చేస్తున్న వారికి 50లక్షల బీమా పథకం అమలుచేసి అదనపు వేతనం ఇవ్వాలని అన్నారు
ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.సురేంద్ర సిఐటియు మండల కార్యదర్శి పి.బాలదేవ్ మహిళ సంఘం నాయకులు వివి జయ,గిరిజనసంఘం నాయకులు రామన్న,రామారావు అంగన్వాడి యూనియన్ నాయకులు నాగమ్మ,లక్ష్మి ఆశా సంఘం నాయకులు సుమిత్ర,కొండమ్మ వివో ఎలా సంఘం నాయకులు రాజ్ కుమార్, దొన్ను, రత్న మణి, పంచాయతీ కార్మికులు, ఆసుపత్రి పారిశుధ్య కార్మికులు, హెచ్ ఎన్ టి సి వర్కర్లు, ఐటీడీఏ కార్మికులు తదితరులు పాల్గొన్నారు

Related Posts