YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కొమరంభీం, టాను నాయక్ ల కృషితో గిరిజనుల అభివృద్ధి 

కొమరంభీం, టాను నాయక్ ల కృషితో గిరిజనుల అభివృద్ధి 

కొమరంభీం, టాను నాయక్ ల కృషితో గిరిజనుల అభివృద్ధి 
కామారెడ్డి ఆగస్టు 09
కోమరంభీం, టాను నాయక్ ల కృషితో గిరిజనుల అభివృద్ధి జరిగిందని ,భారతీయ జనతాపార్టీ గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడు కాట్రోత్ రవి నాయక్ అన్నారు. సోమవారం
కామారెడ్డి జిల్లా కార్యాలయంలో గిరిజన మోర్చా ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా తెలంగాణలో గిరిజన అభ్యున్నతికి పాల్పడిన  కొమరం భీం, టాను నాయక్ చిత్ర పటాలకు ఆయన  పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడు కాట్రోత్ రవి నాయక్ మాట్లాడుతూ,  కొమురం భీం, టాను నాయక్ వంటి వారి త్యాగాల వల్ల గిరిజనులు ఈ రోజు అన్ని రకాలుగా ముందుకు వచ్చే పరిస్థితి వచ్చిందని , కానీ తెలంగాణా లో రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులను ఓటు బ్యాంకుగా చూస్తున్నారు తప్ప ,  అభివృద్ధి విషయంలో చిత్తశుద్ధి చూపటం లేదని ఆరోపించారు.  12 శాతం రిజర్వేషన్లు ఇంకా అమలు కాలేవని, గిరిజన యూనివర్సిటీ కల కలగానే మిగిలిందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణా రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చిన్న రాజులు, రాష్ట్ర నాయకులు వేణుగోపాల్ గౌడ్, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాల్ కిషన్, అసెంబ్లీ కన్వీనర్ లక్మరెడ్డి, పట్టణ అధ్యక్షుడు విపుల్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మోటూరి శ్రీకాంత్, కౌన్సిలర్లు రవి, నరేంధర్ నాయకులు రమేష్, సుధాకర్, సురేష్, వెంకట్, సంతోష్ రెడ్డి, ప్రతాప్, శ్రీకాంత్, వేణు, నరేష్, రాజలింగం, తదితరులు పాల్గొన్నారు.

Related Posts