మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమా వసూళ్లు రికార్డు క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వం వహించగా… సమంత, అనసూయలు తమ పాత్రలతో ఆకట్టుకున్నారు. తెలుగునాటి విడుదలైన ఆ సినిమా వసూళ్లు నెల రోజుల నాటికి రూ.200 కోట్లకు చేరింది. ఫలితంగా నాన్ బాహుబలి మూవీస్ లో ఫస్ట్ ప్లేస్ కు వెళ్లింది. మగధీర తర్వాత అంతకంటే ఎక్కువగా వసూళ్లు సాధించడంతో మెగా ఫ్యామిలీ చాలా సంబరాల్లో ఉంది. ఇప్పుడు ప్రిన్స్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమా ఆ రికార్డును కేవలం రెండు వారాల్లోపే బీట్ చేసింది. విడుదలైన 12 రోజుల్లోనే రూ.200 కోట్లను దాటేసింది. ఇక నెల రోజుల పాటు ఆడితే రూ.300 కోట్లకు పైగానే సాధిస్తుందనే అంచనా వేస్తున్నారు. మహేష్ బాబు, కైరా అద్వాని జంటగా నటించిన ఈ మూవీని కొరటాల శివ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎన్నికల సీజన్ కావడం, మరోవైపు సినిమాలో ప్రిన్స్ మహేష్ బాబు సిఎంగా ఉండటం కలిసొచ్చే అంశాలు. అందుకే జనాలు ఆ సినిమా చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అసలే వేసవి కాలం. ఆ పై సెలవులు.అంతా ప్రీగా ఉన్నారు. ఇలాంటి సమయంలో భరత్ అనే నేను సినిమా బాక్సాఫీస్ వద్ద తన సత్తాను చాటుతోంది. ఏప్రిల్ 20న విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది. సినిమా రిలీజైన 12వ రోజుకు 3 మిలియన్ ట్రేడ్ మార్క్‌ను అమెరికాలో దాటేసింది. ఆస్ట్రేలియాలోనైతే 5 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్ల మార్క్ ను దాటేసింది. ట్రేడ్ అనలిస్ట్, ఇండస్ట్రీ ట్రాకర్ రమేష్ బాలాఈ సంగతిని ట్విటర్ ద్వారా తెలిపారు. భరత్ అనే నేను లేటెస్ట్ ఓవర్సీస్ బాక్సాఫీస్ ఏప్రిల్ 30 వరకు యూఎస్ఏలో 3, 192,011 డాలర్లు(రూ.21.32 కోట్లు), ఆస్ట్రేలియాలో ఏప్రిల్ 29 వరకూ 443,974 ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 2.23 కోట్లు)’’ రాబట్టిందని చెప్పారు. మరోవైపు ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం భరత్ అనే నేను ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ.200 కోట్ల వసూళ్లను దాటింది. త్వరలోనే ఇది రూ.250 కోట్లను క్లాస్ చేస్తుందని అంచనా. సినిమా రిలీజ్ కాకముందే తమ యూనిట్ సభ్యులకు ఐఫోన్లు గిప్ట్ గా ఇచ్చారు సూపర్ స్టార్ మహేష్ బాబు. అంత ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు. సినిమా విడుదల కాకముందే కుటుంబ సభ్యులతో విదేశాలకు వెళ్లి వచ్చాడు మహేష్. ఆయన ఊహించినట్లే ఇప్పుడు సినిమా సక్సెస్ కావడం విశేషం. ఇప్పుడు నా పేరు సూర్య నా ఇళ్లు ఇండియా సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. మరి బన్నీ ఏం చేస్తాడో వేచి చూడాల్సిందే.