అమరావతి లో మహిళలపై దాడులను ఖండిస్తూ టీడీపీ నిరసన
జగన్ ప్రభుత్వానికి మహిళల పట్ల గౌరవం లేదంటూ ఆగ్రహం
టీడీపీ ఆఫీస్ దగ్గర ఆందోళన కార్యక్రమం
కర్నూలు
రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్ జగన్మోహన్రెడ్డికి మహిళల పట్ల ఏమాత్రం గౌరవం లేదని కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఆరోపించారు. నిన్న రాజధాని అమరావతిలో మహిళల పట్ల ప్రభుత్వం అనుసరించిన విధానాన్ని నిరసిస్తూ, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సోమిశెట్టి మాట్లాడుతూ 2014లో రాష్ట్రం విడిపోయి ఆంద్రప్రదేశ్ రాజధాని లేని రాష్ట్రంగా ఉన్న సమయంలో అప్పుడు అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నూతన రాజధాని నిర్మాణం కోసం పలు ప్రదేశాలను సూచిస్తూ ప్రజల-మేదావులు, ప్రతిపక్ష పార్టీల వారి యొక్క అభిప్రాయాలను, సూచనలను తీసుకోవడం జరిగినది. అప్పట్లో మెజార్టీ సభ్యులు 13 జిల్లాలకు మధ్యలో ఉంటుంది. అమరావతి రాజధానికి సరియైన ప్రాంతమని సూచించారు. అప్పట్లో రాష్ట్ర ప్రతిపక్ష నాయకుని హెూదాలో ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి కూడా సాక్ష్యాత్తు రాష్ట్ర శాసనసభలోనే అమరావతిని రాజధానికి బలపరుస్తూ, ఇందుకోసం ఎక్కువ భూమిని సేకరించవలసినదిగా తన అభిప్రాయంలో తెలిపారు. అందరి సూచనతో భూసేకరణకు పూనుకోగా చంద్రబాబునాయుడు పై నమ్మకంతో ఎంతో మంది రైతులు స్వచ్ఛందంగా రాజధాని నిర్మాణం కోసం భూములను ప్రభుత్వానికి ఇవ్వడం జరిగిందని, సుమారు -33 వేల ఎకరాల భూసేకరణ చేసి నిర్మాణాలు చేపట్టడం జరిగింది. అయితే 2019లో రాష్ట్రంలో వై.సి.పి.ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధాని భూములలో అక్రమాలు చోటుచేసుకున్నాయనీ ఆరోపించారు.