గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 35,499 కరోనా కేసులు
న్యూఢిల్లీ ఆగష్టు 9
దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 35,499 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. తాజాగా 39,686 మంది బాధితులు డిశ్చార్జి అవగా.. వైరస్ కారణంగా 447 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు 3,11,39,457 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 4,02,188 ఉన్నాయని పేర్కొంది.మహమ్మారి కారణంగా ఇప్పటి వరకు దేశంలో 4,28,309 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. టీకా డ్రైవ్‌లో భాగంగా ఇప్పటి వరకు 50,86,64,759 డోసులు పంపిణీ చేసినట్లు పేర్కొంది. ఆదివారం నాటికి దేశంలో 48,17,67,232 శాంపిల్స్ పరీక్షించినట్లు ఐసీఎంఆర్ పేర్కొంది. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 97.40 శాతానికి చేరుకుందని, మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 1.26శాతం ఉన్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. వీక్లీ పాజిటివిటీ రేటు 2.35శాతంగా ఉందని, రోజువారి పాజిటివిటీ రేటు 2.59శాతంగా ఉందని వివరించింది.