YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కేసీఆర్ మూడో ఫ్రంట్ ముచ్చటేనా...

కేసీఆర్ మూడో ఫ్రంట్ ముచ్చటేనా...

ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ దేశంలోని చాలా రాష్ట్రాల్లో అప్రతిహతంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కేసీఆర్ ‘ఫెడరల్ ఫ్రంట్’ ప్రకటన ఇటు రాష్ట్ర రాజకీయాల్లోనూ, అటు జాతీయ స్థాయిలోనూ ’మూడో కూటమి’ చర్చకు మరోసారి తెరలేపింది.తాజాగా వెలువడిన ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల ఫలితాల అనంతరం.. దేశంలోని 29 రాష్ట్రాలకు గాను 19 రాష్ట్రాల్లో బీజేపీ సొంతంగా కానీ, మిత్రపక్షాల మద్దతు కానీ అధికారంలో ఉంది. ముఖ్యంగా త్రిపురలో పాతికేళ్ల కమ్యూనిస్టు పాలనకు చరమగీతం పలికి బీజేపీ విజయ పతాకం ఎగురవేయటం దేశవ్యాప్తంగా చర్చకు తెరలేపింది.ప్రస్తుతం.. దక్షిణాది రాష్ట్రాలు, తూర్పు తీరంలోని ఒడిశా, పశ్చిమబెంగాల్, కేరళ రాష్ట్రాలు మాత్రమే బీజేపీ హవాను అడ్డుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రభుత్వంలో ఉన్నా కూడా టీడీపీ - బీజేపీల మధ్య దూరం బాగా పెరుగుతోంది.

తెలంగాణ, పశ్చిమబెంగాల్, ఒడిశా, దిల్లీల్లో మాత్రమే ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నాయి. కేరళలో వామపక్ష ప్రభుత్వం ఉంటే.. కర్ణాటక, పంజాబ్, మిజోరం రాష్ట్రాలు మాత్రమే కాంగ్రెస్ పాలనలో మిగిలాయి. ఇక రానున్న ఎన్నికల్లో కర్ణాటక, పశ్చిమబెంగాల్, ఒడిశాలను సొంతం చేసుకోవటం మీద బీజేపీ దృష్టి కేంద్రీకరించింది.రెండు రోజుల పాటు చైన్నైలో ఉండి వచ్చారు తెలంగాణ సిఎం కేసీఆర్. అసలు సంగతి తప్ప అంతా మాట్లాడారట. ఈ సంగతి డిఎంకే అధినేత కరుణానిధి కుమార్తె కనిమొళి బయట పెట్టారు. కేసీఆర్ తమతో అసలు ఫెడరల్ ఫ్రంట్ గురించే మాట్లాడలేదని చెప్పారు. కనిమొళి పేల్చిన బాంబుతో టీఆర్ఎస్ శ్రేణులే కాదు… జాతీయ నేతలు ఆశ్చర్యపోయారు. అసలు కేసీఆర్ ఎందుకు వెళుతున్నట్లు ఎందుకు వస్తున్నట్లు అర్థం కావడం లేదు. తాను వీర లెవల్లో అంత చేస్తున్నాను. ఇంత చేస్తున్నానని చెప్పడం తప్ప ఏం కావడం లేదంటున్నారు. కేసీఆర్ అంటేనే అబద్దాల కోరు అని విపక్షాలు చెబుతూ వస్తున్నాయి. ఇప్పుడు ఆమె మాటలకు బలం చేకూరుతోంది. మమతాబెనర్జీ ఆహ్వానిస్తే బెంగాల్ కు వెళ్లి వచ్చానని కేసీఆర్ చెప్పారు. కానీ అక్కడకు వెళ్లి వచ్చాక అసలు సంగతి చెప్పారు దీదీ. నేను కేసీఆర్ ను పిలవలేదు. ఆయనే వస్తానన్నారు. రమ్మన్నాను. ఇంటికి ఎవరైనా వస్తామంటే వద్దంటామా అని చెప్పారు. ఫలింతంగా కేసీఆర్ గాలి పోయింది. ఇక ఒడిస్సా సిఎం నవీన్ పట్నాయక్ ను తనను పిలిచారని తెలంగాణ ప్రభుత్వం ఘనంగా ప్రకటించుకుంది. ఆయన్ను కలిసి ఫెడరల్ ప్రంట్ గురించి మాట్లాడటమే తరువాయి అన్నంత బిల్డప్ ఇచ్చింది. తీరా అసలు విషయం ఏంటంటే.. నేను కేసీఆర్ ను ఆహ్వానించలేదన్నారు సిఎం పట్నాయక్. కేసీఆర్ పూరికి వెళుతున్నట్లు చెప్పారు. దారిలో మీ వద్దకు రావచ్చా అని అడిగారు. స్వాగతం అని చెప్పాను. నేను అతన్ని పిలిచింది లేదని చెప్పారు. ఫలితంగా మరోసారి కేసీఆర్ గాలి తుస్సుమంది. ఇప్పుడు డిఎంకే నేత కనిమొళి అదే మాట చెప్పడంతో అసలు కేసీఆర్ చెప్పేదానికి చేసేదానికి పొంతనే లేదంటున్నారు. ఇంకోవైపు కేసీఆర్ నెల రోజులుగా మాతో టచ్ లో ఉన్నారు. హైదరాబాద్ కు రావాలని అడిగారు అందుకే వచ్చానని యూపీ మాజీ సిఎం అఖిలేష్ యాదవ్ చెప్పారు. అంతే ఆయనకై ఆయన వచ్చింది లేదని అర్థమైంది. దళితుడ్ని సిఎం చేస్తానన్నారు కేసీఆర్. హుస్సేన్ సాగర్ చుట్టూరా ఆకాశా హార్మ్యాలు నిర్మిస్తానన్నారు. పేదలందరికీ డబుల్ బెడ్ రూములు అన్నారు. ఇలా ప్రతి విషయంలో హామీలిచ్చారే తప్ప ఆచరణలో అంతంత మాత్రంగానే ఉంది. అందుకే కేసీఆర్ ను ఈ సారి జనాలు నమ్ముతారా అనేది ఆసక్తికరంగా మారింది. బీజేపీ చేతిలో కేసీఆర్ కీలు బొమ్మలా మారాడని..వారి సూచనలతోనే బెంగళూరుకు వెళ్లి జేడీఎస్ తో మంతనాలు జరిపాడనేది వచ్చే ఆరోపణ. బీజేపీ, కాంగ్రెస్ లకు వ్యతిరేకంగా తాము ప్రంట్ ఏర్పాటు చేస్తామని చెబుతున్నా…కేసీఆర్ ను కలిసిన వారెవరు కాంగ్రెస్ కు వ్యతిరేకమని చెప్పడం లేదు. ఫలితంగా ఈ ప్రంట్ ముచ్చట మూడునాళ్లే అని తెలుస్తోంది.  

Related Posts