YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఏజెన్సీలో ప్రశాంతంగా జరిగిన సేవ్ ఇండియా నిరసన

ఏజెన్సీలో ప్రశాంతంగా జరిగిన సేవ్ ఇండియా నిరసన

ఏజెన్సీలో ప్రశాంతంగా జరిగిన సేవ్ ఇండియా నిరసన
కుక్కునూరు, జూలై 9
కుక్కునూరు మండల కేంద్రంలో వ్యవసాయ కార్మిక సంఘాలు, భారత కమ్యూనిస్టు పార్టీ మరియు సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం విజయవంతం.
           పశ్చిమ గోదావరి జిల్లా కుక్కునూరు మండల కేంద్రంలో  సోమవారం నాడు మోడీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్త పిలుపులో బాగంగా సీఐటీయూ,వ్యవసాయ కార్మిక సంఘం, సీపీఐ, న్యూడెమోక్రసీ ల ఆధ్వర్యంలో కుక్కునూరు ప్రధాన సెంటర్లో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు యర్రంశెట్టి నాగేంద్రరావు సీపీఐ మండల కార్యదర్శి మైసాక్షి వెంకటాచారి న్యూడెమోక్రసీ రైతు సంఘం నాయకులు కల్లయ్య మాట్లాడుతూ....
                  మానవుడు జన్మతః స్వేచ్ఛజీవి కానీ బీజేపీ విధానాలు వలన ఎక్కడ చూసిన సంకెళ్ళలోనే కనబడుతున్నాడు.  
 మోడి ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక , ప్రజా , రైతాంగ , ఉద్యోగ వ్యతిరేక విధానాల నుండి భారత దేశాన్ని కాపాడాలని సేవ్ ఇండియా నినాదంతో దేశ హితాన్ని కోరేవారందరు సేవ్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జయప్రదం చేశారు అని. అన్నం పెట్టే రైతాంగం ఢిల్లీ సరిహద్దుల్లో పోరాడుతుంటే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మాత్రం ప్రజాస్వామికవాదులపై , సుప్రీంకోర్టు వంటి రాజ్యాంగ సంస్థల పై ( పెగాసస్ ) గూఢచర్యం చేయడంలో బిజీగా ఉందన్నారు . లాభ నష్టాలతో సంబంధం లేకుండా ప్రభుత్వరంగ సంస్థలను అమ్మేస్తుంటే ప్రభుత్వ ఉద్యోగాల కోసం దేశ యువతరం బీజేపీ విధానాలను నిలదీయాలని అన్నారు. మోడీ విధానాలు వలన రోజు రోజుకు నిత్యావసర ధరలు ఆకాశాన్ని తకుతున్నాయి అని, ఇప్పటికే పెట్రోల్, డీజిల్, వంట నూనె ధరలు పెరిగాయి అని ఇవి చాలక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రవేటికరణ చేస్తుంది అని, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటికరణ చేస్తే ఊరుకునేది లేదని ఉక్కు ఆంధ్రుల హక్కు అని దాని ప్రవేట్ కి ఇస్తే ఉరుకోము అని అన్నారు. దేశ భవిష్యత్తును సామ్రాజ్యవాదుల చేతుల్లోనుండి లాక్కోవాలి .... నిరంకుశత్వానికి వ్యతిరేకంగా భారతీయ ఐక్యతను చాటాలి. భారత రాజ్యాంగమే రక్షణ కవచం కావాలి. అందుకే మహాత్మా గాంధీ క్విట్ ఇండియా ఉద్యమానికి ముందు చెప్పినట్లు “ విజయమో వీర మరణమో ” . మోదీ పాలన నుండి విముక్తి సాధించాలి . “ ఎవరైతే భయపడతాడో వాడు చస్తాడు , ఎవరైతే ఎదిరించి నిలబడతాడో వాడు గెలుస్తాడు అని ఇప్పటికైనా వ్యతిరేక విధానాలు విడనాడాలని లేదంటే ఉద్యమాలు ఉదృతం చేస్తామని  వారు హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో సీపీఎం నాయకులు షేక్ మహబూబ్ పాషా, సీఐటీయూ నాయకులు పద్మ, సరస్వతి, సునీత, తిరపతయ్య,  సీపీఐ నాయకులు వర్సా నాగేశ్వరరావు, కూరకుల బాబూరావు, న్యూడెమోక్రసీ నాయకుల బాసిన సత్యనారాయణ, పొడపటి బాబు తదితరులు పాల్గొన్నారు.


ఫోటో రైట్ అప్ : వేలేరుపాడు మండల కేంద్రంలో వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సేవ్ ఇండియా నిరసన కార్యక్రమం విజయవంతం.

వేలేరుపాడు మండల కేంద్రంలో సేవ్ ఇండియా నిరసన ఉద్యమాన్ని దేశవ్యాప్త నిరసన కార్యక్రమాల్లో బాగంగా వేలేరుపాడు మండలంలో వ్యవసాయ కార్మిక సంఘం (సిఐటియు)సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలపటం జరిగింది ఈ సందర్భంగా నాయకులు మడివి దుర్గారావు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రైతులకు అన్యాయం చేసే మూడు నల్ల చట్టాలను తీసుకోచ్ఛి తీరని అన్యాయం చేయ్యాలని చేస్తుందని ఆరోపించారు అసలు ఈ చట్టాలు మాకోద్దు బాబోయ్ అని రైతులు ఎనిమిది నెలల నుండి డీల్లీ సరిహద్దులో చలికి చస్తు వానకి వణుకుతు ఉద్యమం చేస్తుంటె చట్టాలు మీ మంచికే అంటు నమ్మించే ప్రయత్నం చేస్తుంటేనే అర్థమౌతోంది ఇది ఎవరి ప్రయౌజనాలకోసమోనని నిజానికి ప్రజలపట్ల రైతుల పట్ల అంత చిత్తశుద్దే ఉంటె వారు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు మా టేంటి ప్రజలు ఎదుర్కొంటున్న గ్యాస్ డిజిల్ పెట్రోల్ నిత్యజీవితంలో ఎదుర్కొంటున్న నిత్యావసర సరుకుల దరలు మా టేంటి ఇవ్వన్ని గాలికి వదిలేసి దేశానికి ఎదోమేలు చేస్తున్నట్టు గొప్పలు చెప్పటం నిజంగా చిగ్గుచేటని మండిపడ్డారు ఇప్పటికైనా కేంద్రం పద్ధతి మార్చుకోకపోతే భౌష్యత్ లో ఎదురు దెబ్బ తప్పదని జ్యోష్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో గుమ్మల నరసయ్య, కొత్త వెంకటేశ్వర్లు, కారం కుమార్, ఊకె రాజులు, జి వెంకటేష్, నాగులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts