YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

రెండేళ్లలో లక్ష కోట్లు

రెండేళ్లలో లక్ష కోట్లు

రెండేళ్లలో లక్ష కోట్లు
మెదక్, ఆగస్టు 9, 
తెలంగాణలో దళితుల సమగ్రాభివృద్ధే సీఎం కేసీఆర్ లక్ష్యమని ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. రానున్న రెండున్నరేళ్లల్లో దళితులకు లక్షకోట్ల రూపాయిలు కేటాయించాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ఆలోచన రచిస్తున్నారని స్పష్టంచేశారు. దీనిలో భాగంగా వచ్చే ఏడాది దళితబంధు కింద బడ్జెట్‌లో రూ.20 నుంచి 30 వేల కోట్లు కేటాయించాలని సీఎం కేసీఆర్ ఆర్థిక శాఖను ఆదేశించారని హరీష్ రావు పేర్కొన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా చేర్యాలలో రూ.50 లక్షలతో నిర్మించనున్న డా.బి.ఆర్ అంబేద్కర్ కమ్యూనీటి భవన నిర్మాణ పనులకు ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు దళిత బంధు పథకం గురించి మాట్లాడారు.రానున్న రెండున్నరేళ్లల్లో తెలంగాణ‌లో ద‌ళితుల అభివృద్ధికి ల‌క్ష కోట్ల రూపాయాలు ఖ‌ర్చు చేయనున్నట్లు పేర్కొన్నారు. అన్ని వ‌ర్గాల అభ్యున్నతికి, అభివృద్ధి ప్రభుత్వం కృషి చేస్తుంద‌ని తెలిపారు. ఈ నిధులను ద‌ళితులంద‌రూ స‌ద్వినియోగం చేసుకోవాల‌ని మంత్రి సూచించారు. రైతు బంధు మాదిరే ద‌ళిత బంధు దేశానికే ఆద‌ర్శంగా నిలుస్తుంద‌ని మంత్రి అభిప్రాయపడ్డారు. ఇత‌ర ప‌థ‌కాల‌ను అమ‌లు చేసిన స్ఫూర్తితో ద‌ళిత బంధును సైతం రాష్ట్రమంతటా అమ‌లు చేసి తీరుతామ‌ని హ‌రీష్ రావు స్పష్టంచేశారు. కాగా.. చేర్యాలలో అన్ని హంగులతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కమ్యూనిటీ భవనం నిర్మిస్తామ‌ని హ‌రీష్ రావు తెలిపారు. ఈ జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డితో పాటు ప‌లువురు నాయకులు పాల్గొన్నారు.
కోటి 25 లక్షలతో భవనం
చేర్యాలలో రూ. కోటి 25 లక్షలతో అన్ని హంగులతో డాక్ట‌ర్ బీఆర్ అంబేద్కర్ కమ్యూనిటీ భవనo నిర్మిస్తామ‌ని ఆర్థిక మంత్రి హ‌రీష్ రావు తెలిపారు. ఇవాళ అంబేద్క‌ర్ క‌మ్యూనిటీ భ‌వ‌నానికి మంత్రి భూమి పూజ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డితో పాటు ప‌లువురు పాల్గొన్నారు.ఈ సంద‌ర్భంగా మంత్రి హ‌రీష్ రావు మాట్లాడుతూ.. ఇప్ప‌టికే ఈ భ‌వన నిర్మాణానికి రూ. 50 ల‌క్ష‌ల‌ను మంజూరు చేశామ‌న్నారు. మ‌రో రూ. 75 ల‌క్ష‌లు మంజూరు చేసి.. మొత్తంగా రూ. కోటి 25 ల‌క్ష‌ల‌తో అన్ని హంగుల‌తో భ‌వ‌నం నిర్మిస్తామ‌ని మంత్రి చెప్పారు. రెండున్న‌రేళ్ల‌లో తెలంగాణ‌లో ద‌ళితుల అభివృద్ధికి ల‌క్ష కోట్ల రూపాయాలు ఖ‌ర్చు చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. అన్ని వ‌ర్గాల అభ్యున్న‌తికి ప్ర‌భుత్వం కృషి చేస్తుంద‌న్నారు.వచ్చే సంవత్సరం దళిత బంధు కింద‌ బడ్జెట్ లో రూ.30 వేల కోట్లు కేటాయించాలని ఆర్ధిక శాఖను ఆదేశించామ‌ని తెలిపారు. ద‌ళితులంద‌రూ ఈ నిధుల‌ను స‌ద్వినియోగం చేసుకోవాల‌ని మంత్రి సూచించారు. రైతు బంధు మాదిరే ద‌ళిత బంధు దేశానికే ఆద‌ర్శంగా నిలుస్తుంద‌న్నారు. ఇత‌ర ప‌థ‌కాల‌ను అమ‌లు చేసిన స్ఫూర్తితో ద‌ళిత బంధును అమ‌లు చేసి తీరుతామ‌ని హ‌రీష్ రావు స్ప‌ష్టం చేశారు.

Related Posts