YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

చెవిరెడ్డికి అమర్ రాజా టెన్షన్

చెవిరెడ్డికి అమర్ రాజా టెన్షన్

తిరుపతి, ఆగస్టు 10,
ఏపీలో ఇప్పుడు టీడీపీ ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్‌కు చెందిన అమ‌ర‌రాజా ఫ్యాక్ట‌రీ వివాదం హాట్ టాపిక్‌గా మారింది. ప్రభుత్వమే తామే అమ‌ర‌రాజా ప్లాంట్‌ను ఇక్కడ నుంచి త‌ర‌లించేయ‌మ‌ని చెప్పామ‌ని క్లారిటీ ఇచ్చేసింది. ఎప్పుడో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 30 ఏళ్ల క్రితం ఆయ‌నే ప్రభుత్వం త‌ర‌పున భూమి ఇచ్చి మ‌రీ ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేయించారు. దేశంలోనే నెంబ‌ర్ వ‌న్ ప్యాక్టరీల‌లో ఒక‌టిగా ఉన్న ఈ సంస్థ వ‌ల్ల ప్రత్యక్షంగాను, ప‌రోక్షంగాను 75 వేల మంది ఉపాధి పొందుతున్నారు. ఈ ఫ్యాక్టరీ చంద్రగిరి నియోజ‌క‌వ‌ర్గంలో ఉంది. క‌నీసం గ‌ల్లా ఫ్యామిలీకి 20 వేల ఓటు బ్యాంకు ప‌క్కగా ఉంటోంది. ఇక్కడ ప‌నిచేసే ఉద్యోగులు అంద‌రూ ముందు నుంచి గల్లా ఫ్యామిలీకి స‌పోర్ట్‌గా ఉంటున్నారు. అందుకే ఇక్కడ గ‌ల్లా అరుణ‌కుమారి నాలుగు సార్లు విజ‌యం సాధించారు.2009 ఎన్నిక‌ల్లో ఇక్కడ పోటీ చేసిన గ‌ల్లా అరుణ రోజాపై 10 వేట ఓట్ల మెజార్టీతో విజ‌యం సాధించారు. కేవ‌లం గ‌ల్లా అరుణ ఫ్యాక్టరీలో పనిచేసే ఓట‌ర్లు వ‌న్‌సైడ్‌గా ఓట్లేయ‌డంతోనే నాడు ఆమె గ‌ట్టెక్కార‌న్న టాక్ ఉంది. అయితే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఇక్కడ ఫ్యాక్టరీనే త‌ప్పించేయ‌డంతో ఇక్కడ ప‌నిచేసే 75 వేల మంది నిరుద్యోగులు కానున్నారు. ఇప్పటికే ప్లాంటును త‌మిళ‌నాడు త‌ర‌లిస్తున్నట్టు యాజ‌మాన్యం ప్రక‌టించింది. అయితే ఈ ప్రభావం చిత్తూరు జిల్లాపై ఎక్కువ‌గానే ఉంటుందంటున్నారు. అదికూడా వైసీపీకి కంచుకోట‌గా ఉన్న చంద్రగిరి నియోజ‌క‌వ‌ర్గంలో ఇది మ‌రింత ఎక్కువుగా ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. చంద్రగిరిలో చివ‌రిసారిగా 1994లో అది కూడా ఎన్టీఆర్ ప్రభంజ‌నంలో మాత్రమే టీడీపీ గెలిచింది. అది కూడా చంద్రబాబు సోద‌రుడు నారా రామ్మూర్తి నాయుడు పోటీ చేసి గ‌ల్లా అరుణ‌ను ఓడించారు. ఆ త‌ర్వాత వ‌రుస‌గా మూడు సార్లు గల్లా అరుణ గెలిచారు. ఇక గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ ఇక్కడ నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా చెవిరెడ్డి భాస్కర‌రెడ్డి గెలుస్తూ వ‌స్తున్నారు. ఈ నియోజ‌క‌వ‌ర్గాన్ని ఆయ‌న త‌న కంచుకోట‌గా మార్చుకున్నారు. ఇటీవ‌ల పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో ఇక్కడ టీడీపీ ఒక‌టి రెండు పంచాయ‌తీలు త‌ప్పా అన్ని చోట్ల వైసీపీ విజ‌యం సాధించిందిగల్లా కుటుంబం ద్వారా ఉపాధి పొందిన వేలాది మంది ఓట్లతో ఇక్కడ ఎప్పుడూ ఆ ఫ్యామిలీ సునాయాసన విజ‌యం సాధిస్తూ వ‌చ్చింది. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్కడ చెవిరెడ్డి భాస్కర‌రెడ్డి 41 వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. అయితే ఇప్పుడు అమ‌ర‌రాజా దెబ్బతో క‌నీసం 20 వేల పై చిలుకు ఓట్లు ప్రభావితం అవుతాయ‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇందులో కొన్ని టీడీపీ వాళ్లవి ఉన్నా కూడా ఉపాధి కోల్పోయిన వారు ఆ క‌సితో వైసీపీకి వ్యతిరేకంగా ఓట్లు వేస్తారా ? లేదా జ‌గ‌న్ సంక్షేమం వైపే మొగ్గు చూపుతారా ? అని ర‌క‌ర‌కాల చ‌ర్చలు అయితే న‌డుస్తున్నాయి. మ‌రి చంద్రగిరి ఓట‌రు ఏం చేస్తార‌న్నది ప‌క్కన పెడితే స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డికి కాస్త టెన్షన్ అయితే స్టార్ట్ అయ్యింద‌ట‌.

Related Posts