YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

తాడో పేడోకు సిద్ధమవుతున్న జనసేనాని

తాడో పేడోకు సిద్ధమవుతున్న జనసేనాని

విశాఖపట్టణం, ఆగస్టు 10, 
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్నా ఆయన సంతృప్తికరంగాలేరు. బీజేపీ తో వెళితే అధికారానికి మరో ఐదేళ్ల పాటు దూరం కాక తప్పదని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. ఇప్పటికే పార్టీ నేతల్లోనూ, క్యాడర్ లోనూ నిరుత్సాహం నెలకొంది. మరో ఐదేళ్లు అధికారం దక్కకపోతే పార్టీని మూసివేయడం తప్ప పవన్ కల్యాణ్ కు మరో మార్గం లేదు. అందుకే బీజేపీతో తెగదెంపుల కోసం వేచిచూస్తున్నారని సమాచారం.విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్య ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను ప్రతి ఒక్కరూ తప్పుపడుతున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ప్రయివేటీకరణ వైపు మొగ్గు చూపుతుంది. ఇప్పటికే విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరించవద్దని పవన్ కల్యాణ్ ఒకసారి ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలసి వచ్చారు. కానీ వారి నుంచి స్పష్టమైన హామీని పొందలేకపోతున్నారు.నిజానికి విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యపై పవన్ కల్యాణ్ కు గళమెత్తాలని ఉంది. పోరాడాలన్న భావన ఉంది. కానీ బీజేపీతో ఉన్న పొత్తు అడ్డంకిగా మారింది. స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరిస్తే బీజేపీతో పాటు ఆ ప్రభావం తన పార్టీపై కూడా పడుతుందని పవన్ కల్యాణ్ కు తెలియంది కాదు. అందుకే సమయం కోసం వేచి చూస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోసారి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ అంశంపై ఢిల్లీ వెళ్లి రావాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.అప్పటికీ సానుకూలత రాకపోతే ఆ కారణంతో బీజేపీ నుంచి బయటకు రావాలని పవన్ కల్యాణ్ ఆలోచనగా ఉంది. ఏమీ చేయకుండా ఉంటే తాను రాజకీయంగా నష్టపోక తప్పదని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. ఈ సమస్యతో పాటు కాపు రిజర్వేషన్లపై కూడా పవన్ కల్యాణ్ ఒక స్టాండ్ ను ప్రకటించే అవకాశముందంటున్నారు. మొత్తం మీద ఏదో ఒక కారణంతో బీజేపీ నుంచి బయటపడేందుకే పవన్ కల్యాణ్ ప్రయత్నిస్తున్నారన్న టాక్ నడుస్తుంది.

Related Posts