YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రాజధాని అజెండాగా 2024 ఎన్నికలు

రాజధాని అజెండాగా 2024 ఎన్నికలు

గుంటూరు, ఆగస్టు 10, 
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి మాత్రమే అన్న ఏకైక ఎజండా తో తెలుగుదేశం ముందుకు వెళుతుంది. ఏపీ కి మూడు రాజధానులే ముద్దు అని సాగుతుంది వైసీపీ. ఇరువురు తమ ఎజెండా ల విషయంలో గత రెండేళ్ళుగా ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. ఈ రాజధానుల గోలతో ప్రజలకు ప్రస్తుతం పెద్దగా ఆసక్తి లేదనే తేలిపోయింది. స్థానిక ఎన్నికల్లో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వైసీపీ రాజధానుల వివాదం తెరపైకి వచ్చాకా ఘన విజయాలనే అందుకుంది. అధికారపార్టీ దీనినే చూపిస్తూ టీడీపీ ని ఎగతాళి చేస్తుంది. అయినా టీడీపీ తన అనుకూల మీడియా ద్వారా తనగొంతు ఎలుగెత్తి వినిపిస్తూనే అమరావతి కోసం పోరాటం చేస్తుంది.వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఏక రాజధాని కావాలా ? మూడు రాజధానులు కావాలా అనే అంశంతో రెండు ప్రధాన పార్టీలు ప్రజల ముందుకు రావడం ఖాయమే. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర, రాయలసీమ వాసులకు సమాధానం చెప్పుకోవడం టీడీపీ కి కష్టం గానే మారుతుంది. అమరావతి నుంచి రాజధానుల తరలింపు వైసీపీ చేసినా చేయకపోయినా తెలుగుదేశం అడ్డుపడటం వల్లే ఏమి చేయలేకపోయామని వాదన తో రాయలసీమ, ఉత్తరాంధ్రాల్లో లబ్ది పొందే అవకాశం లభిస్తుందన్నది అధికారపార్టీ దీర్ఘ వ్యూహంలో భాగంగా కనిపిస్తుంది. ఇక కోస్తా ఆంధ్రా ప్రాంతవాసులకు రాజధానుల అంశం పై ఎక్కడ ఉన్నా పెద్దగా పట్టింపులు లేనట్లే జనాభిప్రాయం వినిపిస్తుంది. అమరావతి ఉద్యమం కేవలం రియల్ వ్యాపారం కోసం, ఒక కులంలో కొందరు పెద్దల లబ్ధికోసమే సాగుతుందన్న వైసీపీ ప్రచారం బలంగా ప్రజల్లో ఉండటమే జనం పట్టించుకోకపోవడానికి రీజన్ అంటున్నారు. వచ్చేది లేదు పోయేది లేదంటున్నారు.టీడీపీ చేపట్టిన ఉద్యమాలకు ఆ పార్టీ వారు తప్ప ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి పాల్గొనకపోవడం గమనిస్తే గోదావరి జిల్లాల వాసులు తమకు పోయేది లేదు వచ్చేది లేదన్న ధోరణి కనబరుస్తుండటం గమనార్హం. ఇక ప్రకాశం, నెల్లూరు జిల్లాల వాసులు అంత సీరియస్ గా లేరన్నది తేలిపోతుంది. కేవలం కృష్ణా, గుంటూరు జిల్లాలకు సంబంధించిన వారైనా ఈ పరిణామాం వ్యతిరేకిస్తారా అంటే రాజధాని ప్రాంతంలో భూసేకరణ జరిపిన రైతుల్లో తప్ప సామాన్యులు సీరియస్ గా లేకపోవడం చర్చనీయం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు పెద్దగా ఆసక్తి అవసరం లేని ఈ అంశం ఒక్కటి మాత్రమే పట్టుకుని వేలాడుతున్న టీడీపీ అధిష్టానం వచ్చే ఎన్నికలకు ఇబ్బందుల్లో పడుతుందేమో అన్న ఆందోళన అటు సీమ ఇటు ఉత్తరాంధ్ర ప్రాంత క్యాడర్ లో గుబులు రేగుతుంది. దీన్ని వారు అధిష్టానానికి నివేదించినా టీడీపీ అధినేత తగ్గేదే లే అంటూ ఉండటం విశేషం.

Related Posts