YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కొత్త పార్టీలతో కేసీఆర్ కు లాభమేనా

కొత్త పార్టీలతో కేసీఆర్ కు లాభమేనా

హైదరాబాద్, ఆగస్టు 10, 
తెలంగాణలో కొత్త పార్టీలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. వైఎస్ షర్మిల కొత్త పార్టీని ప్రకటించకముందే మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా తెలంగాణలో కొత్త పార్టీ రావాలంటూ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. అయితే తెలంగాణలో రాజకీయ శూన్యత పెద్దగా లేదు. స్పేస్ లేకుండా కొత్త పార్టీలు పుట్టుకువస్తే అది ఎవరికి లాభం అన్న చర్చ నడుస్తోంది. ఎన్ని పార్టీలు వస్తే అంత ముఖ్యమంత్రి కేసీఆర్ కు లాభిస్తుందన్నది విశ్లేషకుల అంచనా.కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత రెండు దఫాలు అధికారాన్ని చేపట్టారు. గతంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లడంతో నూతన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పాలనను ప్రజలు తొమ్మిదేళ్ల పాటు చూసినట్లయింది. దీంతో సహజంగానే వ్యతిరేకత ఉండక మానదు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారిని పక్కన పెట్టడం, ఇతర పార్టీ నుంచి వచ్చిన వారికే పదవులు ఇవ్వడం వంటి వాటితో పాటు అవినీతి వ్యవహారం కూడా అసంతృప్తికి కారణమయిందనే చెప్పాలి.అయితే కేసీఆర్ ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకతను పార్టీలు చీల్చుకుంటే అది కేసీఆర్ కే లాభం. ఇప్పటికే అప్పటి జేఏసీ ఛైర్మన్ కోదండరామ్ పార్టీ పెట్టారు. ఆయన స్వయంగా పోటీ చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవలేకపోయారు. ఇక్కడ తీన్మార్ మల్లన్న కూడా పోటీ చేయడంతో వ్యతిరేక ఓట్లు చీలిపోయి అధికార పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. ఈ సూత్రం సార్వత్రిక ఎన్నికలకు కూడా వర్తిస్తుందనే చెప్పాలి.ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీలు టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామంటే తామని కొట్లాడుతున్నాయి. దీనికి తోడు షర్మిల పార్టీ ఎంత కాదనుకున్నా రెండు, మూడు శాతం ఓట్లయినా చీల్చే అవకాశముంది. ఇప్పడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పార్టీ పెడితే దళిత ఓటు బ్యాంకుపై నమ్మకం పెట్టుకున్న విపక్ష పార్టీలకు ఇబ్బంది తప్పదు. ఎటు చూసినా కొత్త పార్టీ ఏది పుట్టుకొచ్చినా రాజకీయంగా అది కేసీఆర్ కు లాభిస్తుందనే చెప్పాలి.

Related Posts