దేవ్.. అంటూ.. తమ పార్టీ వ్యూహకర్తను ఘనంగా పరిచయం చేశారు జనసేన అధినేత. ఆ తర్వాత మైక్ అందుకున్న మిస్టర్ దేవ్.. ఇంగ్లీష్ లోనే ఇరగదీశారు. దీంతో ఆయన ఫారిన్ రిటర్న్ అనుకున్నారంతా. అయితే.. దేవ్ పక్కా లోకల్. హైదరాబాద్ లోని చింతల్ బస్తీ స్వస్థలం. మరో ఇంట్రెస్టింగ్ ఇష్యూ ఏంటంటే. ఆయన ఒకప్పుడు బీజేపీ లీడర్.
పార్టీలన్నీ మంచి పర్ఫార్మెన్స్ కోసం వ్యూహకర్తలను నియమించుకుంటున్నాయి. ఈ స్ట్రాటజిస్టులు తమ ఫేట్ మార్చేస్తారని ఆశిస్తున్నాయి. జనసేన కూడా ఈ లిస్ట్ లోనే ఉంది. అయితే.. వ్యూహకర్తగా దేవ్ ను నియమించుకోవడమే స్రవత్రా చర్చనీయాంశమైందిరాజకీయ వ్యూహకర్తలు తాము పని చేసే పార్టీల ఇమేజ్ పెంచేందుకు కృషి చేస్తారు. అయితే జనసేన విషయంలో ఇదేమంత వర్కవుట్ అయ్యే పరిస్థితి లేదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. బీజేపీతో లింక్స్ ఉన్న దేవ్ వల్ల ఆ పార్టీకి పెద్ద మైలేజ్ రాదన్న టాక్ నడుస్తోంది.రాజకీయ పార్టీలు వ్యూహకర్తలను నియమించుకోవడం తాజా ట్రెండ్ గా ఉంది. అయితే.. ఇది మరీ లేటెస్ట్ ఏమీ కాదు. పురాతన కాలం నుంచీ వస్తున్న ధోరణే. కాకపోతే.. ఆధునిక కాలంలో పార్టీలు ఎక్కువైపోవడంతో మరోసారి వ్యూహకర్తలకు ఆదరణ పెరిగింది.ప్రస్తుతం ప్రతీ పార్టీ ప్రజాసంక్షేమంపైనే మాట్లాడుతోంది. ప్రజాకర్షణ మ్యానిఫెస్టోలు విడుదల చేస్తోంది. వీటన్నింటిలో ది బెస్ట్ అని ప్రజల్లో ముద్ర వేయించుకునేందుకు రాజకీయ పార్టీలు ఆరాటపడుతున్నాయి. న్నికలకు వెళ్లాలంటే దానికి ఓ లెక్క ఉంటుంది. వ్యూహాలు, రాజకీయ ఎత్తుగడ, ప్రత్యర్థి పావులకు చెక్‌పెట్టడం, ప్రజల నాడికి అనుగుణంగా వెళ్లడం ఇదంతా ఓ స్ట్రాటజీ. ఇలాంటి వాటిని విజవంతంగా అమలు చేయాలంటే రాజకీయాల్లో తలపండిన వారై ఉండాలి. దీనికి తోడు ఇప్పుడు సోషల్ మీడియా యాక్టీవ్ అయింది. కాబట్టి రానున్న ఎన్నికల్లో మరింత వ్యూహాత్మంగా వ్యవహరించాల్సి వస్తుంది. 2019 ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, వైసీపీ నువ్వా నేనా అన్నట్టు ఓ స్ట్రాటజీ ప్రకారం వెళుతున్నారు. ప్రజాకర్షకంగా వ్యవహరిస్తున్నారు. ఈ వ్యవహారం వెనుక చాలా బుర్రలే పనిచేస్తున్నాయి. వైసీపీకి ప్రముఖ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీం నిరంతరం శ్రమిస్తోంది. సర్వేలు చేస్తూ ప్రజా నాడిని తెలుసుకుంటూ ఆ మేరకు జగన్ ప్రచార యాత్రను డిజైన్ చేస్తున్నారు. మరో వైపు టీడీపీ ప్రత్యేకంగా వ్యూహకర్తలు ఎవరూ లేకపోయిన అందులో ఉన్న సీనియర్లంతా ప్రత్యక్ష ఎన్నికల్లో పనిచేసిన అనుభవం గల వారే. ముఖ్యంగా చంద్రబాబునాయుడు అండ్ టీం చివరి క్షణంలో ఎదో ఒక మ్యాజిక్ చేసి అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుంటుంది. ఈ రెండుపార్టీలకు దీటుగా పవన్ తన జనసేనను సిద్దం చేసేపనిలో ఉన్నారు. కింది నుంచి చాలా జాగ్రత్తగా పార్టీ నిర్మాణం చేసుకుంటూ వస్తున్నారు.
ఈ క్రమంలో ఎన్నికల వ్యూహకర్తగా వాసుదేవ్ ను ప్రకటించారు. పీకే అంత గొప్ప చరిత్ర ఉన్నట్టు వాసుదేవ్ గురించి పవన్ స్వయంగా చెప్పుకొచ్చారు. ప్రధానిమోదీ తో కూడా అతను పనిచేసినట్టు పార్టీ నాయకులు చెబుకున్నారు. వీరి అంచనాలు రెట్టింపు చేస్తూ వాసుదేవ్ మాట్లాడుతూ తనకు తెలుగు రాకపోయిన ఎన్నికల స్ట్రాటజీపై బాగా పట్టుందని ప్రకటించాడు. 350 మందితో పనిచేస్తున్నట్టు బీరాలకుపోయాడు. అతని వ్యవహారం నేటీజన్లకు కాస్త ఉత్సాహం కలిగించింది. అంతే అతని వివరాలను సేకరించే పనిలో ఉన్నారు. షాకింగ్ ఏంటంటే వాసుదేవ్ గతంలో బీజేపీ నుంచి టికెట్టు కోసం ప్రయత్నించారు. ఈ క్రమంలో అప్పటి బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డితో సన్నిహతంగా మెదిలినట్టు కొన్ని ఫొటోలు వెలుగులోకి వచ్చాయి. ఇంకాస్త లోతుగా వెళ్లగా వాసుదేవ్ ఓ సభలో స్పష్టంగా తెలుగు మాట్లాడిన వీడియోలు కనిపించాయి. తెలుగు రాదని చెప్పిన వాసుదేవ్ బీజేపీ సభలో తెలుగు మాట్లాడటం అందరిని ఆశ్చర్య పరిచింది. వాసుదేవ్ పై సోషల్‌మీడియాలో విమర్శలు మొదలయ్యాయి. అబద్దాలు చెప్పే వాడు ఎన్నికల వ్యూహ రచన ఏం చేస్తాడని….. వపన్ వెనుకాల బీజేపీ ఉందని, అందుకే వాసుదేవ్ జనసేనకు వచ్చాడని….. పీకెను అనుసరించబోయి క్లీన్ బౌల్డ్ అయిన వాసుదేవ్ ఇలా అనేక రకాల కామెంట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వాసుదేవ్ ఎంపిక విషయంలో పవన్ కూడా కలవరపడుతున్నాడట.