జిల్లాలోని దేవరుప్పుల మండలం సింగరాజుపల్లి వ్యవసాయ మార్కెట్ లోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో గురువారం కురిసిన అకాలవర్షానికి తడిసిన ధాన్యం రాసులను ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు పరిశీలించారు. గాలివానకు జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు. తడిసిన ప్రతిగింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతాంగం ఆందోళన చెందవద్దని హామీ ఇచ్చారు. సియం కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం ఆహర్నిశలు ఆలోచించే మహా నాయకుడని.. రైతులకు ఏ ఆపద వచ్చినా ప్రభుత్వం నుంచి ఆదుకునేందుకు కృషిచేస్తారన్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన నష్టాన్ని అధికారులతో సమీక్షిస్తున్నారని, పాలకుర్తి నియోజకవర్గంలో రైతులకు జరిగిన నష్టాన్ని ప్రభుత్వం ద్వారా ఇప్పించేందుకు కృషిచేస్తానని, రైతులు ఆవేదన చెందవద్దని ఎమ్మెల్యే ఎర్రబెల్లి హామీఇచ్చారు.