నెల్లూరు
దివ్యాంగులకు బ్యాక్ లాగ్ ఉద్యోగాల నియామక పత్రాలు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు విధులు బాధ్యతలు నిర్వర్తించాలని సూచించారు. నగరంలోని కలెక్టరేట్ తిక్కన ప్రాంగణంలో 2020- 21 సంవత్సరానికి సంబంధించి విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ ద్వారా దివ్యాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగులకు నియామక పత్రాలను జిల్లా కలెక్టర్ అందజేశారు. ప్రత్యేక నోటిఫికేషన్ ప్రకారం దరఖాస్తు చేసుకున్న ప్రతిభ కనపరిచిన అర్హులైన అభ్యర్థులకు 4 వతరగతి శ్రేణి లో పి హెచ్ మేస్త్రి , సబార్డినేట్, కాపలాదారు , పీహెచ్ వర్కర్, గ్యాంగ్ కూలి , కమాటి పోస్టులకు సంబంధించి అంధుల విభాగం నుండి 5 మందికి, శారీరక వైకల్యం విభాగం నుండి 5 మందికి మొత్తం 10మంది దివ్యాంగులకు జిల్లా కలెక్టర్ నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సంయుక్త కలెక్టర్ హరెంధిర ప్రసాద్ , అభివృద్ధి సంయుక్త కలెక్టర్ గణేష్ కుమార్ , విభిన్న ప్రతిభావంతుల, వృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు నాగరాజ కుమారి తదితరులు పాల్గొన్నారు.