గుంటూరు,
మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు హౌస్ అరెస్ట్ దళిత ప్రతిఘటన ర్యాలీ కి బయలుదేరిన ఆనంద బాబు ఆనంద బాబు ను అడ్డుకున్న పోలీసులు పోలీసులు తీరు పట్ల ఆనంద బాబు ఆగ్రహం.
నక్కా ఆనంద బాబు మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం పై మండిపడ్డారు. దళిత ప్రతిఘటన ర్యాలీ ను అడ్డుకోవడం పై మండిపడ్డారు. దళితులు, ఎస్టీలు, మైనారిటీ ఓట్లు తోనే జగన్ అధికారం లోకి వచ్చాడు. ఓట్లు వేసి గెలిపించిన దళిత మైనారిటీ లపైనా జగన్ ఉక్కుపాదం మోపుతున్నారు. భారతదేశం లో ఎక్కడా లేని విదంగా ఏపిలో దళితులపై దాడులు జరుగుతున్నాయి. శిరోముండనాలను జగన్ ప్రభుత్వం మరల ప్రవేశ పెట్టింది. దళితుల పైనే అట్రాసిటి కేసులు పెడుతున్నారు. రాజ్యాంగం దళితులకు కల్పించిన హక్కులను జగన్ కాలరాస్తున్నాడు. దళితులపై జగన్ కక్ష్య కట్టినట్లుగా పాలన చేస్తున్నాడు. జగన్ ప్రభుత్వానికి సవాల్ వేస్తున్నా. దమ్ముంటే దళితుల అభివృద్ధి పై చర్చ కు రావాలి.