YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

దమ్ముంటే దళితుల అభివృద్ధి పై చర్చ కు రావాలి.

దమ్ముంటే దళితుల అభివృద్ధి పై చర్చ కు రావాలి.

విశాఖ
దేవస్థానం సిబ్బంది పై  పురుషోత్త పురం గ్రామస్తులు తిరుగబడ్డారు. కోర్టులో ఉన్న భూమిలో దేవస్థానం సిబ్బంది అన్యాయంగా తమ ఇల్లు ను కూలగొట్టడానికి వచ్చారు అంటూ ఆగ్రహం  వ్యక్తం చేసారు. పెందుర్తి పోలీస్ స్టేషన్ లో దేవస్థానం అధికారులు పై ఫిర్యాదు చేసారు. లీగల్ గా  ఉన్న తమ పై అన్యాయంగా కట్టుకున్న ఇల్లును కూలదోయడానికి వచ్చారంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేసారు.  1960 లో జరిగిన అగ్ని ప్రమాదంలో పూరి గుడిసెలు కాలిపోతే, అప్పటి ఇందిరమ్మ ప్రభుత్వం 250 గజాల చొప్పున 74 మందికి ఇల్లు మంజూరు చేశారని గ్రామస్తులు అన్నారు. అప్పటినుండి ఇప్పటివరకు నలుగురు దేవస్థానం ఈ వో లు మారిన ఈ సమస్య లేదు. మళ్లీ కొత్తగా ఈవో సూర్య కళ వచ్చినప్పటినుండి సమస్య వచ్చిందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. సంఘటనా స్థలానికి మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ,  94 వ వార్డ్ కార్పొరేటర్ బల్ల శ్రీనివాసరావు వచ్చారు.
మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ మాట్లాడుతూ దేవస్థానం అధికారులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.  2009 వైయస్ రాజశేఖర్రెడ్డి ప్రభుత్వం హయాంలో సుమారు 80 ఇళ్లకు దేవస్థానం అధికారులు అడ్డు పడకుండా ఇబ్బందులకు గురి చేయొద్దని స్పెషల్ జీవో తెచ్చారు. ఏ హక్కుతో ఇళ్లను కొల్లగొడుతున్నారు తెలియజేయవలసిందిగా దేవస్థానం ఈవో ను ప్రశ్నించారు. ఎమ్మెల్యే అదీప్ రాజు, మంత్రి అవంతి శ్రీనివాసరావు గత  ఎలక్షన్ కు ముందు పంచ గ్రామాల సమస్యలు ఆరునెలలు పరిష్కరిస్తామని చెప్పిన నాయకులు ఇప్పుడు రెండున్నర సంవత్సరాలు గడిచిన కమిటీల పేరుతో కాలం గడిపిన దుస్థితి ఏర్పడిందని గండి బాబ్జి మండిపడ్డారు. అన్యాయంగా పేదల ఇళ్లపై దేవస్థానం అధికారులు తీరు మారకపోతే రానున్న రోజుల్లో ప్రజా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.

Related Posts