నెల్లూరు
నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట పట్టణంలో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ వెంకటసురేష్ దారుణ హత్యకు గురయ్యారు. కారును పార్క్ చేయడానికి వెళ్లగా.. గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి హత్య చేశారు.సూళ్లూరుపేట మునిసిపాలిటీ పరిధిలోని 16వ వార్డు కౌన్సిలర్ అయిన వెంకటసురేష్ తన పుట్టిన రోజు కావడంతో కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లారు. తిరిగి సాయంత్రం సూళ్లూరుపేట చేరుకున్నారు. కుటుంబ సభ్యులను బ్రాహ్మణ వీధిలోని ఇంటివద్ద దింపిన వెంకటసురేష్ కారును పార్కింగ్ చేయడానికి పొట్టి శ్రీరాములు వీధిలోని పార్కింగ్ స్థలానికి వెళ్లారు.ఈ క్రమంలో దారుణ హత్యకు గురి కావడం సంచలనంగా మారింది.దీంతో సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు దర్యాప్తు చేపట్టారు