YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా తెలంగాణ

ఫిల్మ్ హబ్‌గా హైదరాబాద్‌ అభివృద్ధి: మంత్రి తలసాని

ఫిల్మ్ హబ్‌గా హైదరాబాద్‌ అభివృద్ధి: మంత్రి తలసాని

హైద‌రాబాద్ ఆగష్టు 10
హైదరాబాద్‌ను ఫిల్మ్ హబ్‌గా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమ‌ని రాష్ట్ర సినిమాటోగ్ర‌ఫి శాఖ‌ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. న‌గ‌రంలోని బీఆర్‌కేఆర్ భవన్‌లో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి త‌ల‌సాని అధ్యక్షతన మంగ‌ళ‌వారం స‌మీక్షా సమావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సినిమా షూటింగ్‌ల కోసం పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇస్తున్నట్లు చెప్పారు.లాక్ డౌన్ సమయంలో థియేటర్‌లు మూసివేసి ఉన్న కార‌ణంగా విద్యుత్ చార్జీలు, ప్రాపర్టీ ట్యాక్స్ మినహాయింపు తదితర విజ్ఞప్తుల‌ను ప్రభుత్వానికి అందజేసిన‌ట్లు తెలిపారు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వచ్చే సమావేశంలో తగు నిర్ణయం తీసుకుంటామ‌న్నారు. చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తోంద‌న్నారు. 5వ ఆట ప్రదర్శనకు కూడా అనుమతించడం జరిగింద‌న్నారు.

Related Posts