YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

చేనేత కార్మికులకు ఒక్కో కుటుంబానికి తెలుగుదేశం హయాంలో 50 వేల రూపాయలు

చేనేత కార్మికులకు ఒక్కో కుటుంబానికి తెలుగుదేశం హయాంలో 50 వేల రూపాయలు

చేనేత కార్మికులకు ఒక్కో కుటుంబానికి తెలుగుదేశం హయాంలో 50 వేల రూపాయలు
 ఇప్పుడు ఉన్న ప్రభుత్వం 24 వేల రూపాయలు మాత్రమే ఇస్తున్నారు
 మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి

నంద్యాల
నంద్యాల పట్టణంలో మంగళవారం నాడు జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ తెలుగు దేశం ప్రభుత్వ హయాంలో, ఒక్కో చేనేత కర్మికుడికి ఎడాదికి రూ 50 వేలకు పై బడి అందే పధకాలు, సాయాన్ని రద్దు చేసి నేతన్న నేస్తం పేరుతో రూ 24 వేలు చేతిలో పెట్టడం నేస్తమా. మోసమా. అని అన్నారు.
రాష్ట్ర వ్యప్తంగా 3.50 లక్షలకు పైగా చేనేత కార్మికులు మగ్గాలపై పని చెస్తుంటే 69 వేల మందికి మాత్రమే పధకం వర్తించడం నేస్తమా... మోస పూరితమా ప్రజలే ఆలోచించు కోవాలని సూచించారు.
బీసిలకు 56 కార్పొరెషన్లు ఎర్పాటు చేస్తున్నట్లు  హడావుడి చేస్తూ స్థానిక సంస్థల ఎన్నికలలో 10 శాతం కోత పెట్టి 16,800 మందికి రాజకీయ పదవులు దూరం చేయడం . మోసగించడం అని  అన్నారు. . బీసి కార్పొరేషన్ ద్వారా బిసీల అభ్యున్నతికి  ఖర్చు చేయాలసిన రూ 18,050 కోట్లు మళ్ళించడం ఏంత వరకు సమంజసమని ప్రశ్నించారు.
వైస్సార్ ప్రభుత్వం నేస్తం అంటూనే బిసిలను మోసం చేస్తుంది అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Posts