YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యేలు

ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యేలు

ఏలూరు,ఆగస్టు 11, 
ఏపీలో అధికార వైసీపీలో ఎంపీలు, ఎమ్మెల్యేల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. పలు జిల్లాల్లో మంత్రులకు ఎంపీలకు , ఎంపీలకు ఎమ్మెల్యేలకు మధ్య ఏ మాత్రం పోస‌గ‌టం లేదు. ఈ క్రమంలోనే గత ఏడాది కాలంగా ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ – చింతలపూడి ఎమ్మెల్యే వీఆర్‌. ఎలీజా మధ్య కొనసాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం కాస్తా ఇప్పుడు తారాస్థాయికి చేరుకుంది. ఏలూరు ఎంపీగా ఉన్న కోటగిరి శ్రీధర్ కు చింతలపూడి సొంత నియోజకవర్గం. ఈ నియోజకవర్గం నుంచి కోటగిరి శ్రీధర్ తండ్రి మాజీ మంత్రి కోటగిరి విద్యాధరరావు 5 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి రాజ‌కీయంగా ఏకచక్ర ఆధిపత్యం కొనసాగించారు. ఈ క్రమంలోనే కోటగిరి శ్రీధర్ కు చింతలపూడి నియోజకవర్గంలో బలమైన అనుచ‌ర‌గ‌ణం ఆయ‌న‌కు ఉంది. గత ఎన్నికల తర్వాత ఎంపీ, ఎమ్మెల్యేలు కొద్దిరోజుల పాటు కలిసే ముందుకు నడిచారు. కోటగిరి శ్రీధర్ ఏలూరు పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నా చింతలపూడి సొంత నియోజకవర్గం కావడంతో ఇక్కడ ప్రధానంగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే తన అనుచర వర్గాన్ని మరింత పటిష్టం చేసుకుంటున్నారు. ఇక్క‌డ కోటగిరి శ్రీధర్, ఆయ‌న అనుచ‌ర‌గ‌ణం దూకుడుగా ఉండ‌డం ఎలీజాకు న‌చ్చ‌లేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఎంపీ, ఎమ్మెల్యే వర్గాలు పోటీ పడ్డాయి. ఒకే పార్టీ నుంచి రెండు వేర్వేరు వ‌ర్గాలు పోటీ చేయ‌డంతో పార్టీ కేడ‌ర్ కూడా రెండుగా చీలిపోయింది. ఎలీజా, కోటగిరి శ్రీధర్ సొంత మండలంలోనే ఆయన వర్గానికి ధీటుగా మరో బలమైన వర్గాన్ని తయారు చేస్తున్నారు. కోట‌గిరి ఫ్యామిలీకి సుదీర్ఘకాలంగా రాజకీయ శత్రువులుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే గంటా మురళి సోదరుడు స‌త్యంబాబును ఎలీజా కావాల‌ని పార్టీలో చేర్చుకున్నారు. పైగా గంటా మురళి టిడిపిలో కీలక నేతగా ఉంటే ఆయన సోదరుడు వైసీపీ లోకి రావటం విచిత్రం.దీనివల్ల పార్టీకి ఎంత ? ప్రయోజనం కలుగుతుంది అన్నది పక్కన పెడితే కేవలం కోటగిరి శ్రీధర్ ని రెచ్చగొట్టే క్రమంలోనే మురళి సోదరుడిని పార్టీలోకి తీసుకు వచ్చారని ప్రచారం జరుగుతోంది. ఎంపీ కోటగిరి శ్రీధర్ కామవ‌ర‌పు కోట మండలంని వైసిపి కంచుకోటగా చేయడంతోపాటు కామవరపుకోట మేజర్ పంచాయతీని ద‌త్త‌త‌ గ్రామంగా తీసుకున్నారు. ఎలీజా చింతలపూడి ఎమ్మెల్యే గా ఉన్నప్పటికీ కోటగిరి శ్రీధర్ సొంత మండలం కామవరపుకోటలో ఆయన వ‌ర్గానికి ఎక్కువ ప్ర‌యార్టీ ఇస్తే సరిపోయేది..! కానీ ఆయ‌న ఎంపీతో ఢీ అంటే ఢీ అనేలా వ్యవహరిస్తుండడంతో ఇక్కడ పార్టీ రెండుగా చీలిపోయింది.ఇక గ‌తంలో ఎమ్మెల్యే కొంద‌రు నేత‌ల‌కు ప‌ద‌వులు ఇచ్చారు. ఇప్పుడు వారు ఎంపీ కోటగిరి శ్రీధర్ క్యాంప్‌లో ఉన్నార‌ని వారి ప‌ద‌వులు పీకేస్తున్నారు. ఇది కూడా నియోజ‌క‌వ‌ర్గ పార్టీలో చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఎలీజా ప్రస్తుతానికి కోటగిరిని ఢీ కొడుతున్నా.. వచ్చే ఎన్నికలకు ముందు ఇది ఎమ్మెల్యేకు ప్లస్ అవుతుందని చెప్పలేని పరిస్థితి. గత ఎన్నికలకు ముందు వైసీపీని చింతలపూడిలో ఓడించడానికి తీవ్ర ప్రయత్నాలు చేసిన నేతలనే ఇప్పుడు ఆయన పార్టీలోకి చేర్చుకోవడం పార్టీ శ్రేణులకు నచ్చటం లేదు. ఇక నియోజ‌క‌వ‌ర్గంలోని అన్ని మండ‌లాల్లో ఎంపీతో సంబంధం లేకుండా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లు ఓపెన్ చేస్తున్నారు.ఎమ్మెల్యేతో సంబంధం లేకుండా ఎంపీ కోటగిరి శ్రీధర్ సైతం మున్సిపాల్టీ కేంద్ర‌మైన జంగారెడ్డిగూడెంలో త‌న క్యాంప్ ఆఫీస్ ఓపెన్ చేయ‌బోతున్నారు. ఇక పార్టీలోనే జ‌రుగుతోన్న మ‌రో ప్ర‌చారం ఏంటంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలీజాకు టిక్కెట్ రాకుండా ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయని.. కొంద‌రు ప్ర‌భుత్వ అధికారుల‌ను ఇప్పుడే తెర‌మీద‌కు తెస్తున్నారంటున్నారు. ఏదేమైనా ఎంపీ , ఎమ్మెల్యేల మ‌ధ్య ఈ పోరుకు ఫుల్‌స్టాప్ ప‌డ‌క‌పోతే గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ వైసీపీ సాధించిన రికార్డు విజ‌యం మూడునాళ్ల ముచ్చ‌టే అయ్యే ప్ర‌మాదం ఉంది.

Related Posts