విశాఖ
శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఉపాలయం సీతారామాలయంలో ధ్వజస్తంభం కూలిపోయింది. బుధవారం ఉదయం 6:30 ప్రాంతంలో కూలిపోయింట్లు సీసీ ఫుటేజ్ లో అధికారులు గుర్తించారు. దాదాపు 60 ఏళ్లు క్రితం ఏర్పాటుచేసిన ఈ ధ్వజస్తంభం లోపలి కర్ర పూర్తిగా చెదలుపట్టడమే కారణంగా అనుమానిస్తున్నారు. వేద మంత్రాలు, సంప్రోక్షణ తర్వాత ధ్వజస్తంభం స్థానంలో తాత్కాలిక ధ్వజస్తంభం ఏర్పాటు చేసారు. ఈఓ సూర్యకళ మాట్లాడుతూ పది రోజుల్లో శాశ్వతంగా కొత్త ధ్వజ స్తంభం ఏర్పాటు చేస్తామని అన్నారు.