గుంటూరు
గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. వట్టిచెరుకూరు మండలం, ముట్లూరులో హత్య జరిగింది. తల్లిదండ్రులు కన్న బిడ్డను హతమార్చారు. ప్రేమ వ్యవహారమే ఘటనకుకారణం. ప్రేమ విషయమై కూతురు - తల్లిదండ్రుల మద్య వివాదం జరిగింది. ఈ ఘర్షణలో కుమార్తె భవానీ(18) మృతి చెందింది. దీంతో తల్లిదండ్రులు కూతురు మృతదేహాన్ని గుట్టు చప్పుడు కాకుండా దహనం చేశారు. గ్రామస్తుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు తల్లిదండ్రులను ప్రశ్నించారు. వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో.. సంఘటన ప్రదేశాన్ని పరిశీలించి అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.