YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

అక్కడ దళిత బందు-ఇక్కడ దళిత బొంద

అక్కడ దళిత బందు-ఇక్కడ దళిత బొంద

విశాఖపట్నం
రాష్ట్రం లో  వైసిపీ ప్రభుత్వం ఏర్పడ్డాక దళితులను అణగదొక్కే విదంగా ముఖ్య మంత్రి జగన్ మొహాన రెడ్డి పాలన సాగిస్తున్నారని విశాఖ లో దళిత సంఘాల నేతలు  నిరసనలు తెలియజేశారు . స్థానిక అంబేద్కర్ భవన్ లో దళిత సంఘాలు ఐక్య వేదిక ఆధ్వర్యంలో 'అక్కడ దళిత బందు-ఇక్కడ దళిత బొంద 'అనే కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దళిత నాయకుడు వెంకట రావు మాట్లాడుతూ తెలంగాణ లో దళిత బందు లా కేసీఆర్ పాలన సాగుతుంటే ఆంద్రప్రదేశ్ లో మాత్రం జగన్మోహనరెడ్డి దళితులను బొంద పెట్టాలని చూస్తున్నాడని మండి పడ్డారు. జగన్మోహనరెడ్డి ముఖ్య మంత్రి అయిన నుంచి నేటి వరకు ఎస్సీ లకు ఒక్క రూపాయి కూడా రుణ సహాయం అందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ లను విడదీసి మూడు కార్పొరేషన్ లుగా చేశారని, నిదులు మాత్రం లేవని ఎద్దేవా చేశారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిదులు ఏర్పాటు చేసి కేంద్రం నుంచి రావాల్సిన వాటా తీసుకురావాలని డిమాండ్ చేశారు. తక్షణమే అర్హులైన దళితులందరికీ రుణాలు మంజూరు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో జేఏసీ నేతలు పాల్గొన్నారు.

Related Posts