YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

పోలీసులు వేధిస్తున్నారంటూ యువకుడు ఆత్మహత్య

పోలీసులు వేధిస్తున్నారంటూ యువకుడు ఆత్మహత్య

రాజమహేంద్రవరం
పోలీసులు వేధిస్తున్నారంటూ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. నా చావుకి పోలీసులే కారణమని సెల్ఫీ వీడియో విడుదల చేసిన పిచ్చికి మజ్జి అనే యువకుడు... ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంవత్సరం క్రితం తెలంగాణ నుండి రాజమహేంద్రవరం వస్తు రెండు మద్యం బాటిల్స్ తీసుకొస్తుంటే జగ్గయ్యపేట దగ్గర ఉన్న చిల్లకల్లు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో కొంత మొత్తంలో డబ్బు తీసుకుని మజ్జిని వదిలేశారు. సంవత్సరం తర్వాత కానిస్టేబుల్ శివ ఫోన్ చేసి సెటిల్ చేసుకోకపోతే ఇబ్బంది పడతావు అని చెప్పడంతో మజ్జి చిలకల్లు వెళ్లాడు. లక్ష రూపాయలు డిమాండ్ చేసిన కానిస్టేబుల్ శివ లేదంటే గంజాయి కేసు పెడతానని బెదిరించాడు. తిరిగి వచ్చి ఈరోజు ఉదయం రాజమండ్రి రూరల్ పిడుంగొయ్య గ్రామంలో ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Related Posts