నయం కానీ రోగాలెన్నింటినో నయం చేసే వైద్య కేంద్రం చక్రసిద్ధ్‌ను ప్రారంభించిన సూపర్‌స్టార్ మహేశ్
సిద్ధ వైద్యం ఓ అద్భుతమైన చికిత్స, ప్రామాణికమైనది, పురాతనమైనది, సంప్రదాయకమైన అద్భుతమైన సిద్ధ వైద్యమనే అద్భుతమైన చికిత్సను ప్రోత్సహించడం చాలా సంతోషంగా ఉంది: మహేశ్
సిద్ధ వైద్యంను ప్రమోట్ చేయడం మా బాధ్యత: నమ్రత
హైదరాబాద్, ఆగస్ట్ 11,
సూపర్‌స్టార్ మహేశ్ తన సతీమణి నమ్రతతో కలిసి బుధవారం హైదరాబాద్ శివారులోని శంకరపల్లి అనే గ్రామ పమీపంలోని మోకిలాలో నయంకానీ ఎన్నో రోగాలను నయం చేసే `చక్రసిద్ధ` అనే చికిత్సా కేంద్రాన్ని ప్రారంభించారు. శాంతా బయోటిక్స్ చైర్మన్ కె.ఐ.వరప్రసాద్ రెడ్డి, ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి, యాంకర్ సుమ, రాజీవ్ కనకాల తదితరులు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. తమ శారీరక, మానసిక బాధలను తొలగించి నొప్పిలేని జీవితాన్ని గడపటానికి ఇది చక్కటి ప్రదేశమని డా.సత్య సింధూజ తెలిపారు. . యోగ శాస్త్ర మద్దతుతో, 4000 సంవత్సరాల పురాతనమైనదిగా చెప్పబడే సిద్ధ వైద్యం, మానవ ఉనికియొక్క శారీరక, ఆధ్యాత్మిక మరియు మానసిక అంశాలలో స్థిరమైన సమతుల్యతను రగిలిస్తుంది. ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ.. అరుదైన చికిత్సా విధానాన్ని అందించే కేంద్రాన్ని ప్రారంభించడం తనకు సంతోషంగా ఉందని అన్నారు. ఇది కేవలం వ్యాధిని నయం చేసే పద్ధతి కాదు, కానీ ఇది మన మొత్తం జీవనశైలిని మార్చడంలో సహాయపడుతుంది. సిద్ధ వైద్యలో అనేక రకాలు ఉన్నాయని మహేశ్ తెలిపారు. . డాక్టర్ సత్య సింధూజ చక్ర సిద్ధ నాడి వైద్యంలో నిపుణురాలు. ఇదొక భిన్నమైన చికిత్స. నాకు తెలిసినంత వరకు ఈ ప్రపంచంలో ఇలాంటి చికిత్సను అందిస్తున్న నిపుణురాలు ఈమె మాత్రమే. మైగ్రేన్, వెర్టిగో, కొన్ని కండరాల వ్యాధులను నయం చేయడానికి ఉపయోగించే చికిత్స మాత్రమే కాదు, ఎలాంటి వ్యాధినైనా నయం చేయవచ్చు. డా.సత్య సింధూజగారు చెప్పే సూచనలను పాటిస్తే మనం అద్భుతాలను చూడొచ్చు. మన జీవన శైలిని మార్చుకోవచ్చు. ఇలాంటి ప్రామాణికమైన, పురాతనమైన, సంప్రదాయకమైన చికిత్సను ప్రమోట్ చేయడాన్ని సంతోషంగా భావిస్తున్నాను. నొప్పి, అసౌకర్యం లేని జీవితం ఎలా ఉంటుంతో ఊహించండి. అలాంటి నొప్పి లేని జీవితాన్ని గడపటానికి సరైన ప్రాంతం చక్రసిద్ధ్. సిద్ధవైద్యం చేస్తున్న వారిలో డా.భువనగిరి సత్య సింధుజ 36 వ తరానికి చెందిన వ్యక్తి. సిద్ధ వైద్యంలో సుప్రసిద్ధురాలైన వ్యక్తి ఈమె.
మానవ శరీరంలో 72 వేల ఎనర్జీ చానెల్స్ ఉంటాయి. దీర్ఘకాలిక నొప్పులను తగ్గించడానికి ప్రెజర్ పాయింట్స్ నుంచి శక్తిని స్క్రీనింగ్ చేస్తారు. ఇదే తరహా చికిత్సను విదేశాల్లో అందిస్తే వారు దానికెంతో ప్రాధాన్యత ఇస్తారో అర్థం చేసుకోండి. వారు దీన్ని చాలా విలువైనదిగా భావించి ఎంతో జాగ్రత్తగా పరిరక్షించుకునేవారు. నోబెల్ బహుమతిని కూడా ఇచ్చి ఉండేవారు. కాబట్టి ఈ అద్భుతమైన చికిత్సను గుర్తించడం, గౌరవించడం, అందరికీ తెలిసేలా చేయడం మన బాధ్యత`` అని మహేశ్ అన్నారు.
నమ్రత మాట్లాడుతూ ``వైవిధ్యమైన, సంప్రదాయకమైన, పురాతనమైన, ప్రామాణికమైన చికిత్స ఇది. డా.సత్య సింధుజ మేడమ్ తల్లిలాంటివారు. అందరినీ తన బిడ్డలుగా ఆదరించి ట్రీట్‌మెంట్ చేస్తుంటారు. చికిత్సలో ఆమె ఎలాంటి వివక్షను చూపించరు. ఆమెలోని ఈ తత్వమే నన్ను ఆకర్షించింది. ఈ చికిత్సా విధానాన్ని అందరికీ తెలియజేయాల్సిన బాధ్యత మనపై ఉంది. మనదే కాదు, ప్రతి ఒక్కరీ బాధ్యత. ఇది మన దేశానికి చెందిన నిధిలాంటిది. దీన్ని మనం సరిగ్గా సెలబ్రేట్ చేసుకోవాలి`` అన్నారు.
మహేశ్ కొంతకాలం మైగ్రేన్ సమస్యతో బాధపడ్డారు. అయితే ఈ చికిత్సతో ఆయనకు పూర్తిగా రిలీఫ్ కలిగింది. బాధ నుంచి విముక్తి కలిగించే ఈ అద్భుతమైన మార్గాన్ని ఆయన ప్రపంచానికి తెలియజేయాలనుకున్నారు. అందువల్ల ఆయన ఈ విషయాన్ని అందరికీ తెలియజేయాలని తనకు తానుగా ముందుకు వచ్చారు. ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. అలాగే స్పాండిలైటిస్ సమస్యతో బాధపడ్డానని, ఇప్పుడు పూర్తిగా నయమైందని, ఇప్పుడు మేం ఫ్యామిలీ ఫ్రెండ్స్‌లా మారామని యాంకర్ సుమ తెలయజేసింది. ఆమె తన భర్త రాజీవ్ కనకాలతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సిద్ధ భారత దేశానికి చెందిన పవిత్రమైన, పురాతనమైన చికిత్స. సమస్యను మూలాలకు వెళ్లి పరిష్కరిస్తుంది. మన జీవన విధానమిది. ఎముకలు, జాయింట్స్, లిగ్మెంట్స్, కండరాలు, నాడీ వ్యవస్థలోని సమస్యలను పరిష్కరించుకోవచ్చు. 35 తరాలుగా ఈ వైద్య విధానంలో చికిత్సను విజయవంగా చేస్తూ వస్తున్నారు. ఈ 36 తరంలో డా. భువనగిరి సత్య సింధుజ వైద్య సేవలను 25 సంవత్సరాలుగా కొనసాగిస్తూ వస్తున్నారు.
మన శరీరానికి ఎలాంటి మెడిసిన్స్ అవసరం లేకుండా అనేక వ్యాధులను నయం చేసుకునే శక్తి ఉంటుంది. ఈ సిద్ధ చికిత్సలో శరీరంలో నొప్పులను తగ్గించుకునే శక్తిని పునరుద్ధరించుకోవచ్చు.
ఇంతకీ ఈ చికిత్స ఎలా జరుగుతుందంటే.. ముందుగా మన శరీరంలోని వివిధ మర్మ స్థానాలుంటాయి. వాటిని గుర్తించి నొప్పిని తగ్గించేలా సిద్ధ వైద్య ప్రక్రియను ప్రారంభిస్తారు. ఆయా స్థానాలకు ప్రెజర్‌ను పంపుపడం ద్వారా అస్థిపంజర వ్యవస్థను యాక్టివేట్ చేస్తారు. ఈ విధానంలో సత్య సింధుజగారు దీర్ఘ కాలిక సమస్యలతో బాధపడుతున్న 70 వేల మందికి ఎలాంటి మందులు అవసరం లేకుండా చికిత్స చేసి తగ్గించారు. చికిత్స ఖర్చుని భరించలేని వారికి ఆమె ఉచితంగానే వైద్య సాయాన్ని అందించారు. ఇతర విధానాల కంటే సిద్ధ సంప్రదాయకమైన విధానం. నొప్పులను సులభంగా తగ్గిస్తుంది.