YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకుంటాం...అకాల వర్షాలకు ప్రాణ ,ఆస్తి ,పంట నష్టం జరగడం పై మంత్రి హరీష్ రావు భరోసా...

నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకుంటాం...అకాల వర్షాలకు ప్రాణ ,ఆస్తి ,పంట నష్టం జరగడం పై మంత్రి హరీష్ రావు భరోసా...

గురువారం కురిసిన అకాల వర్షాలకు ప్రాణ ,ఆస్తి ,పంట నష్టం జరిగింది అని మంత్రి హరీష్ రావు అన్నారు.. తెలంగాణలో కూడా చిమ్మ చికట్లతో కూడిన గాలి వానలు  పలు జిల్లాల్లో పడ్డాయి. చాలా చోట్ల వరి, మొక్కజొన్న ధాన్యం తడిసిందని మంత్రి చెప్పారు. గురువారం సాయంత్రమే అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో అత్యవసర కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి వెంటనే మార్కెట్లు, ఇతర కొనుగోలు కేంద్రాలకు వెళ్లాలని అదేశించానని తెలిపారు. రైతులు అధైర్య పడకుండా వారికి భరోసా కల్పించాలని సూచించినట్లు వివరించారు. మిషన్లతో వరి కోతలు చేపట్టిన క్రమంలో ఒక్కసారిగా మార్కెట్లలోకి ధాన్యం వచ్చిందని అన్నారు. ఫలితంగా తాత్కాలికమైన ఇబ్బందులు తలెత్తాయని , లారీలు , టార్పాలిన్లు కొరత ఏర్పడిందని వెల్లడించారు. తగిన స్థాయిలో హమాలీలు కూడా అందుబాటులో లేరని పేర్కొన్నారు. అనుకోకుండా వర్షం  పడటం వల్ల ధాన్యం తడిసిందే తప్ప అజాగ్రత్త వల్ల కాదని చెప్పారు. అందుకే ముందస్తు చర్యలు చేపట్టామని వివరించారు. రవాణా శాఖ అధికారులతో సమన్వయం చేసుకొని లారీలను మార్కెట్కు తరలించాలని కలెక్టర్లను ఆదేశించినట్లు ప్రకటించారు. అంతే కాకుండా రైతుల ట్రాక్టర్లలో కూడా ధాన్యాన్ని మిల్లులకు తరలించే వెసులుబాటు కల్పించాలని అధికారులకు సూచించనట్లు స్పష్టం చేశారు. 

అన్ని రకాల ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం....

రాష్ట్రంలో ఉన్న అన్ని మార్కెట్ యార్డ్ లలో అన్ని రకాల ధాన్యాన్ని వరి ,మొక్కజొన్న ,కందులు ,మినుములు ,ప్రొద్దుతిరుగుడు లను కొనుగోలు చేస్తున్నామని మంత్రి హరీష్ రావు అన్నారు గతంలో వరి ,మొక్కజొన్న మాత్రమే కొనుగోలు చేసేవారు అని తెలంగాణ ప్రభుత్వం వచ్చాక రైతులు పండించిన ప్రతి ధాన్యాన్ని కొంటున్నామని అన్నారు. సిద్దిపేట మార్కెట్ యార్డ్ లో ఇప్పటికి వరకు వరి 16, 211 క్వింటాళ్లు రూ  1590 మద్దతు ధర , మొక్కజొన్న 11, 511 క్వింటాళ్లు , రూ 1425  మద్దతు ధర , ప్రొద్దు తిరుగు 2611క్వింటాళ్లు రూ 4100 మద్దతు ధర కొనుగులు చేసమన్నారు...ధాన్యాన్ని అరబెట్టుకోవడానికి ,వర్షానికి తడవకుంటా ఉండేందుకు జిల్లాలో 10వేల టార్పాలిన్ కవర్లు  సబ్సిడీ మీద ఇస్తున్నట్లు రూ 1250 కే అందుబాటులో ఉన్నాయన్నారు..ప్రతి మండల కేంద్రం లో వ్యవసాయ విస్తరణ అధికారుల వద్ద తీసుకోవచ్చు అని..రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు..

Related Posts