పూర్తి స్థాయిలో రాజన్న గుడి అభివృద్ది
రాజన్న సిరిసిల్ల
దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బుధవారం వేములవాడ రాజన్న ను దర్శించుకున్నారు. తరువాత మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నే పవిత్రమైన ఆలయం వేములవాడ రాజన్న ఆలయం. వేములవాడ రాజన్న ఆలయం సామాన్యులకు అండగా ఉంది. రాష్ట్రంలో నే ఎక్కువ భక్తులు వచ్చేది వేములవాడ రాజన్న ఆలయం దగ్గరకే. యాదాద్రి తర్వాత రాజన్న ఆలయం పూర్తి స్థాయిలో అభివృధ్ధి జరుగుతుంది. భక్తులకు రూమ్స్ కొరత ఉండడంతో కొత్తగా 60 వసతి గదులు నిర్మించాం. కరోనా సమయంలో సైతం రాజన్న ఆలయానికి వేలాది మంది భక్తులు వస్తున్నారని అన్నారు. కేటిఆర్ జిల్లా ను అన్ని హంగులతో అభివృద్ధి చేస్తున్నారు. కరొనా కారణం గా కొంత ఆదాయం తగ్గింది అయిన సంక్షేమ మాత్రం ఆగలేదు. దళిత బంధు పూర్తి స్థాయిలో సక్సెస్ అవుతుంది. రాజన్న ఆలయం కి వీటి డీఏ నుండి ఇప్పటి వరకు 100 కోట్లు పెట్టాం, త్వరలో మరో 50 కోట్లు బడ్జెట్ లో పెడుతున్నాం. సీఎం కేసీఆర్ రాజన్న ఆలయంను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందుకే 30 ఎకరాల ల్యాండ్ ను ప్రైవేట్ నుండి తీసుకున్నారు. రాబోయే రోజుల్లో శృంగేరి పీఠం ఇచ్చిన ప్రకారం అబివృద్ది జరుగుతుందని అన్నారు.