రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే నోటిఫికేషన్ విడుదల చెయ్యాలి
శాతవాహన యూనివర్సిటీ డిగ్రీ విద్యార్థులకు సెల్ఫ్ సెంటర్లు ఏర్పాటు చేయాలి
విద్యారంగ,నిరుద్యోగ సమస్యలు పరిష్కారానికి
డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ధర్నా
జగిత్యాల ఆగస్టు 11
విద్యారంగ,నిరుద్యోగ సమస్యలు పరిష్కరించి ,రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1,91,126 ఉద్యోగాలను వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరుతూ బుధవారం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జగిత్యాల జిల్లా భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ ఎఫ్ ఐ) ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యారంగ,నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ కార్యాలయంలో ఏవో కి వినతి పత్రం అందజేశారు.ఆనంతరం డివైఎఫ్ఐ, ఏస్ ఎఫ్ ఐ అధ్యక్ష ,కార్యదర్శులు నిమిషకవి రాజేష్ ,మహమ్మద్ అక్రమాలిక్ మాట్లాడుతూ రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న1,91,126 ఉద్యోగాల పై ఒకేసారి నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.అలాగే శాతవాహన యూనివర్సిటీ పరిధిలో కోవిడ్ నేపథ్యంలో డిగ్రీ పరీక్షలను సెల్ఫ్ సెంటర్ ఏర్పాటు చేయాలని, రాష్ట్రంలో వివిధ శాఖల్లో తొలగించిన 52,515 మంది ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని, 27 మంది నిరుద్యోగ కుటుంబాలకు ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. డిగ్రీ విద్యార్థులకు 5 వ సెమిస్టర్ జరిగి 15 రోజులు గడిచిన తర్వాత ఆరవ సెమిస్టర్ కి ప్రభుత్వం పరీక్షలు సిద్ధం చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఇది విద్యార్థుల భవిష్యత్తు ఆడుకోవడం అని విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న ప్రభుత్వానికి రానున్న ఎలక్షన్ లో విద్యార్థులు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటివరకు నిరుద్యోగులకు ఎలాంటి ఉద్యోగాల క్యాలెండర్లను విడుదల చేయలేదని వెంటనే ఉద్యోగాల క్యాలెండర్లను విడుదల చేయాలని,పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ తక్షణం విడుదల చేయాలని అన్నారు. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చేంత వరకు నిరుద్యోగ భృతి కల్పించాలని,కార్పొరేట్ ప్రైవేట్ వైద్య సంస్థల్లో ఫీజులు నియంత్రించాలని డిమాండ్ చేశారు. కరోనా నేపథ్యంలో ప్రైవేటు,కార్పొరేట్ హాస్పిటల్ లో జరుగుతున్న అన్యాయాలకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. కరోనా నేపథ్యంలో పేద ,మధ్య తరగతి కుటుంబాలు ప్రైవేట్ ,కార్పొరేట్ హాస్పిటల్ లో చికిత్సలు తీసుకుని లక్షల బిల్లు కట్టి వారి కుటుంబాలు చిన్నభిన్నం ఆవుతున్నాయిని,అధిక
ఫీజులు వసూలు చేసే, ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్ పై వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేనియెడల ఆందోళన నీ ఉద్రిక్తం చేసి విద్య,వైద్య రంగాలపై న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా డివైఎఫ్ఐ నాయకులు మెంగా సాగర్,మనోహర్, ఎస్ ఎఫ్ ఐ నాయకులు వినోద్, నిఖిల్,అనిల్,సంద రాకెష్, అభిషేక్, దొమ్మటి రాకేష్ ,కృష్ణ చైతన్న ,శశి, ఉప్పులేటి సాయి తదితరులు పాల్గొన్నారు.