లోక్‌సభ నిరవధిక వాయిదా
న్యూఢిల్లీ ఆగష్టు 11
రెండు రోజులకు ముందే లోక్‌సభ నిరవధిక వాయిదా పడింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా ఇవాళ లోక్‌సభ చివరిసారి సమావేశమైంది. నిజానికి ఈనెల 13 వరకు సభలు జరగాల్సి ఉంది. కానీ గత రెండు వారాల నుంచి విపక్షాలు సభలో ఆందోళన సృష్టిస్తున్న విషయం తెలిసిందే. సభా కార్యక్రమాలను విపక్షాలు అడ్డుకుంటున్నాయి. దీంతో స్పీకర్ ఓం బిర్లా ఇవాళ విపక్షాల తీరును తప్పుపట్టారు. ఈ సెషన్‌లో ఎన్ని గంటల పాటు సభా కార్యక్రమాలు జరిగాయో ఆయన వెల్లడించారు. ఈసారి సభా కార్యక్రమాలను అనుకున్నట్లు సాగలేదని, కేవలం 22 శాతం మాత్రమే ప్రొడక్టివిటీ రికార్డు అయ్యిందన్నారు. అంతకుముందు హిమాచల్ ప్రదేశ్ సీఎం వీరభద్ర సింగ్ మృతికి సంతాపం తెలిపారు. లోక్‌సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. ఈసారి 20 బిల్లులు పాసైనాయి. ఈసారి 74 గంటల 46 నిమిషాల పాటు లోక్‌సభ జరిగినట్లు స్పీకర్ బిర్లా చెప్పారు.