తృటిలో తప్పిన రోడ్డు ప్రమాదం
నలుగురుకి గాయాలు..
కలవరం చెందిన ఆర్టీసీ డ్రైవర్లు కండక్టరు
పత్తికొండ
పట్టణంలో ఆర్టీసీ డిపోకు వెళ్ళు క్రాస్ రహదారి వద్ద ఊహించని రీతిలో రోడ్డు ప్రమాదం జరగడంతో ప్రయాణికులు తీవ్ర కలవరం చెందారు. బుధవారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటల సమయంలో ఆర్టీసీ బస్టాండ్ నుంచి ఏపీ 21 టిజెడ్ ఆటో పుచ్చకాయల మాడ గ్రామానికి బయలుదేరింది. అదే సమయంలో ఆర్టీసీ బస్ డిపో నుంచి బస్టాండ్ కు బయలుదేరిన ఏపీ 29 జెడ్ 0450 నంబరు గల బస్ క్రాస్ రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన ఆటో బస్ ఒకదానికొకటి గుద్దుకోవడం తో ఆటో బోల్తా పడింది. ఒక్కసారిగా ఆటోలో నుంచి తీవ్రమైన పొగలు రావడంతో అక్కడ ఉన్న బస్సులు, లారీలు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు కనిపించక పోవడంతో భారీ ప్రమాదం జరిగిందంటూ ఆందోళన చెందారు. సమీపంలో కానిస్టేబుల్ ఉదయ్ కుమార్ వేగంగా సంఘటన స్థలానికి చేరుకొని ఆటోలో ఉన్న వెంకటేష్, నాగన్న, గోవిందు, కాశీనాథ్ లను బయటకు తీసుకొని వచ్చారు. అందరికీ చిన్న చిన్న గాయాలు కావడం తప్ప ప్రాణాపాయం లేకపోవడంతో అక్కడ ఉన్న వారందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆటో బోల్తా పడటం వల్ల ఆటో పైపు కాస్త దెబ్బతిన్నదని ఆటో నిర్వాహకుడు ఆవేదన వ్యక్తం చేశారు. బస్ డ్రైవర్ నుంచి తప్పు లేకపోయినా ఆటో నిర్వహకుని బాధను చూసి అక్కడ ఉన్న వారందరూ చెప్పడం వల్ల మానవతా దృక్పథంతో బస్ డ్రైవర్ 3 వేల ఆర్థిక సహాయం అందించారు. ఎలాంటి ఘర్షణలకు తావు లేకుండా అక్కడికి చేరుకున్న కానిస్టేబుల్ ఉదయ్ కుమార్ సునాయాసంగా పరిష్కారం చేసి పంపారు.