YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కళా వెంకట్రావుకు అదే మైనస్సా

కళా వెంకట్రావుకు అదే మైనస్సా

శ్రీకాకుళం, ఆగస్టు 12, 
కళా వెంకటరావు అంటే సీనియర్ మోస్ట్ లీడర్. ఆయన ఎన్టీయార్ మెచ్చిన నేతగా ఉన్నారు. నాలుగు దశాబ్దాలుగా పాలిటిక్స్ చేస్తూ తనదైన శైలిలో కొనసాగుతున్నారు. అలాగే 1983 నుంచి టీడీపీలో ఉంటూ గెలుస్తూ వచ్చిన నేత. మధ్యలో కొన్నాళ్ళు ప్రజారాజ్యం పార్టీలో ఆయన ఉన్నా కూడా చంద్రబాబు తిరిగి ఆదరించడంతో టీడీపీకి ఏపీ ప్రెసిడెంట్ గా నియమితులయ్యారు. అంతే కాదు విద్యుత్ మంత్రిగా ఒక వెలిగారు. అయితే 2019 ఎన్నికల్లో ఆయన ఎచ్చెర్ల నుంచి పోటీ చేసి ఓడిపోవడం, లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా టీడీపీని గెలిపించలేకపోవడంతో ఒక్కసారిగా ఇమేజ్ డ్యామేజ్ అయింది.కళా వెంకటరావు ఎమ్మెల్యేగా కెరీర్ స్టార్ట్ చేసింది ఉణుకూరు నుంచి. ఆ అసెంబ్లీ సీటు ఇపుడు లేదు. ఆ తరువాత 2009 లో జరిగిన నియోజకవర్గాల పునర్ విభజన తరువాత ఎచ్చెర్లను ఆయన ఎంచుకున్నారు. అయితే ఇక్కడ ఆయన మూడు సార్లు పోటీ చేస్తే గెలిచింది మాత్రం ఒక్కసారే. ప్రజారాజ్యం తరఫున 2009లో తొలిసారి ఎచ్చెర్లలో పోటీ చేస్తే మూడవ స్థానానికి పడిపోయారు. . ఇక్కడ స్థానబలం ఉన్నది అసెంబ్లీ మాజీ స్పీకర్ ప్రతిభాభారతికి. ఆమె అయిదు సార్లు ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా నెగ్గారు. అయితే ఆమెను పక్కన పెట్టి 2014లో కళా వెంకటరావు టీడీపీ తరఫున పోటీ చేసి గెలిచారు.ఇక 2014 ఎన్నికల్లో కూడా కళా వెంకటరావుకు వచ్చిన మెజారిటీ అయిదు వేల లోపు మాత్రమే. 2019 నాటికి అది కాస్తా రివర్స్ అయి ఓడిపోయారు. వైసీపీ నుంచి గొర్లె కిరణ్ కుమార్ గెలిచారు. ఇక కళా వెంకటరావు వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుంచి తమ కుమారుడిని పోటీకి దింపడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. రాష్ట్ర కార్యదర్శి పదవిని తనయుడుకి ఇప్పించుకున్నారు. తన కుమారుడికి టికెట్ ఇస్తే తాను రాజకీయాల నుంచి వైదొలుతానని కళా చెబుతున్నారు. అయితే అదంత సులువు కాదని ఆయన వ్యతిరేక వర్గం అంటోంది. కళా నాన్ లోకల్ అయినా రెండు సార్లు అధినాయకత్వం మాట మీద సమర్ధించామని, ఈసారి అసలు కుదరదు అంటోంది ప్రత్యర్ధి వర్గం.ఇక ఎచ్చెర్లలో చూసుకుంటే కళా వెంకటరావుది ఒక గ్రూప్, మాజీ స్పీకర్ ప్రతిభాభారతిది మరో గ్రూప్ గా ఉంది. ఇక టీడీపీ సీనియర్ నేత కలిశెట్టి అప్పలనాయుడు ఇపుడు మూడవ వర్గంగా తయారు అయ్యారు. తాజాగా చంద్రబాబు సాధన దీక్షకు పిలుపు ఇస్తే కళా వర్గం ఒక వైపు, కలిశెట్టి వర్గం మరో వైపు ఆందోళలను నిర్వహించారు. అసలే ఎచ్చెర్లలో టీడీపీకి పట్టు తగ్గుతున్న వేళ ఇలా వర్గాలుగా చీలిపోవడం వల్ల మరింతగా చిత్తు అవుతారు అంటున్నారు. అయినా సరే కళా వెంకటరావు ఫ్యామిలీ మొత్తాన్ని మోయడానికి మాత్రం మేము ససేమిరా అని తమ్ముళ్ళు అంటున్నారు. లోకల్ గా ఉన్న వారిలో ఎవరికి టికెట్ ఇచ్చినా తమ మద్దతు ఉంటుంది అని చెబుతున్నారు. మొత్తానికి ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ గా పనిచేసిన కళాకే సీటు గోవిందా అన్నట్లుగా సిక్కోలులో సీన్ ఉందిపుడు.

Related Posts