YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రాప్తాడు రోడ్డు ప్రమాదం.. మార్చురీని సందర్శించిన ఛీఫ్ విప్ పల్లె

రాప్తాడు రోడ్డు ప్రమాదం.. మార్చురీని సందర్శించిన ఛీఫ్ విప్ పల్లె

రాప్తాడు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం మృతదేహాలను  ప్రభుత్వ ఛీఫ్ విప్ పల్లె రఘునాధ్ రెడ్డి పరిశీలించారు. రాప్తాడు సమీపంలో ఆటో , ఓల్వో బస్సు ఢీ కొని ఈ ప్రమాదంలో నల్లమాడ మండలం వెళ్ళమద్ది కొత్తపల్లి కి చెందిన మోహన్ నాయక్ (40) గౌరీ బాయి,(36) సాగర్ (9) మృతి చెందారు. మృతదేహాలను  అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ లో ఉంచారు. శుక్రవారం  ఉదయం అనంత పురం ఆసుపత్రి మార్చురీ లో ఉన్న మృతదేహాలకు తులకు త్వరగా పంచనామా చేసి స్వస్థలంకు పంపాలని వైద్యాధికారులకు పల్లె ఆదేశించారు. ప్రమాదంలో  గాయపడిన చిన్నారి ఉదయ లక్ష్మీ  కి మెరుగైన వైద్యం అందించాలని సవేరా ఆసుపత్రి వైద్యులకు సూచించారు.  మృతుల కుటుంబానికి ప్రభుత్వ పరంగా ఆర్థిక సాయం అందిస్తామని, పల్లె హామీ ఇచ్చారు. మృతుల కు చంద్రన్న బీమా ప్రీమియం ఉంటే త్వరగా చంద్రన్న బీమా పరిహారం తో పాటు, వాహనప్రమాద బీమా, అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గాయపడి సవేరా ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న ఉదయలక్ష్మి కి వైద్య ఖర్చులు ప్రభుత్వ పరంగా, తాను వ్యక్తిగతంగా కొంత అందజేస్తానని బాధిత కుటుంబానికి హామీ ఇచ్చారు. ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయి అనాధ గా ఉన్న చిన్నారి  ఉదయలక్ష్మి చదువు కు తనవంతు సాయం చేస్తానని ,ఆ బాలికకు అన్ని విధాలుగా సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. తక్షణ సాయం కింద బాధిత కుటుంబానికి ప్రభుత్వ చీఫ్ విప్  రూ.12 వేల రూపాయల ను అందించారు. ఆసుపత్రిలో ప్రభుత్వ చీఫ్ విప్ వెంట ఆత్మకూరు సిఐ శివ నారాయణ స్వామి, రాప్తాడు ఎస్ ఐ ధరణి బాబు లు పాల్గొన్నారు. 

Related Posts