న్యూఢిల్లీ ఆగష్టు 12
ఒలింపిక్స్ అథ్లెటిక్స్‌లో ఇండియాకు తొలి గోల్డ్ మెడల్ సాధించి పెట్టిన జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా ఈ మెగా ఈవెంట్‌లో కెరీర్‌నే మార్చేసింది. తాజాగ ఆతను వరల్డ్ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి చేరాడు. అతడు ఏకంగా 14 స్థానాలు ఎగబాకడం విశేషం. ఒలింపిక్స్ ప్రారంభానికి ముందు అతడు 16వ స్థానంలో ఉన్నాడు. ఫైనల్లో 87.58 మీటర్ల దూరం జావెలిన్ విసిరి ప్రత్యర్థులకు అందనంత దూరంలో నిలిచాడు.ప్రస్తుత ర్యాంకింగ్స్‌లో నీరజ్ 1315 పాయింట్లతో జర్మనీ స్టార్ జావెలిన్ త్రోయర్ జోహనెస్ వెటర్ తర్వాతి స్థానంలో ఉన్నాడు. వెటర్ 1396 పాయింట్లతో ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. ఈ ఏడాది ఏడుసార్లు 90 మీటర్ల కంటే ఎక్కువ దూరం విసిరిన వెటర్.. ఒలింపిక్స్ ఫైనల్లో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు.