హైదరాబాద్ ఆగష్టు 12
కేంద్ర హోంమంత్రిత్వ శాఖ గురువారం ఎక్సలెన్స్ మెడల్స్ ను ప్రకటించింది. ఈ ఏడాదిలో దేశవ్యాప్తంగా 125 మంది పోలీస్ సిబ్బందికి మెడల్స్ ప్రదానం చేయనుంది. ఇందులో సీబీఐతో పాటు ఎన్‌ఐఏ, ఎన్‌సీబీ సిబ్బందిని సైతం ఎంపిక చేసింది. అలాగే 28 మహిళా పోలీసులు సైతం ఉన్నారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ నుంచి అత్యధికంగా 11 మంది చొప్పున, యూపీలో 10 మందికి, కేరళ, రాజస్థాన్ నుంచి తొమ్మిది మంది చొప్పున, తమిళనాడులో 8 మందికి, బిహార్ నుంచి ఏడుగురికి, గుజరాత్, కర్ణాటక, ఢిల్లీ నుంచి ఆరుగురు పోలీసులను ఎక్సలెన్స్ మెడల్స్ వరించాయి. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీ నుంచి ఐదుగురు చొప్పున పోలీసులు మోడల్స్‌కు ఎంపికయ్యారు. కేంద్ర ప్రభుత్వం 2018 నుంచి ఎక్సలెన్స్ అవార్డులను అందిస్తోంది. నేర పరిశోధనలో అత్యుత్తమంగా ప్రతిభ చూపిన వారికి ‘యూనియన్ హోంమినిష్టర్స్ మెడల్స్’ ఇస్తున్న విషయం తెలిసిందే.నేర పరిశోధనలో అసాధారణ పత్రిభ చూపిన పోలీసులను ప్రోత్సహించేందుకు ఐదు రకాల పతకాలను అందజేస్తోంది. వీటిలో ‘స్పెషల్ ఆపరేషన్స్ మెడల్, పోలీస్ ఇంటర్నల్ సెక్యూరిటీ సర్వీస్ మెడల్, ఎక్స్‌ట్రార్డినరీ స్కిల్స్ మెడల్, ఉత్కృష్ట్ సేవ మెడల్, ఇన్వెస్టిగేషన్‌లో మెడల్ ఆఫ్ ఎక్సలెన్స్’ ఇస్తూ వస్తోంది. 2020లో 121 మంది ‘మెడల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్వెస్టిగేషన్’కు ఎంపికయ్యారు.‘మెడల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్వెస్టిగేషన్’కు తెలంగాణ నుంచి ఐదుగురు పోలీసులు ఎంపికయ్యారు. ఇందులో నాయిని భుజంగరావు (ఏసీపీ), ఏ మధుసూదన్ (డెప్యూటీ ఎస్పీ), ఎన్ శ్యామ్ ప్రసాద్‌రావు (ఏసీపీ), జీ శ్యామ్ సుందర్ (ఏసీపీ), నెనావత్ నగేశ్ (ఎస్‌ఐ) ఎంపికయ్యారు