ఆరోగ్యంగా ఉంటేనే సమర్థవంతంగా విధులు నిర్వహించగలుగుతాము
-ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యాన్నిమించిన అస్తి మరొకటి లేదు
--జిల్లా ఎస్పీ సిహెచ్.ప్రవీణ్ కుమార్
నిర్మల్,
ఈరోజు ఉదయం నిర్మల్ కార్యాలయ ఆవరణలో ఉచిత మెడికల్ క్యాంప్ ను యశోద హాస్పిటల్ హైదరాబాద్ మరియు శరత్ మాక్స్విజన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వరంగల్ గారి సౌజన్యంతో జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది. జిల్లా ఎస్పీ సిహెచ్.ప్రవీణ్ కుమార్ మెడికల్ క్యాంపును ప్రారంభించి, వైద్య శిబిరంలో ఎస్పీ బీపీ, కంటి పరీక్ష చేసుకున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికారులు, సిబ్బంది ఎల్లప్పుడు విధినిర్వహణలో ఉండటం వలన తమ ఆరోగ్యం పట్టించుకోక పోవడంతో ఎన్నో రకాల అనారోగ్యాలకు గురవుతున్నారని ఆరోగ్యంపై అవగాహన ఎంతో ముఖ్యమని, సిబ్బంది యొక్క కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు దినచర్య, జీవన విధానం మిగతావారితో పూర్తి భిన్నంగా ఉంటుందని, ఇందుకుగానూ మన ఆరోగ్య పరిరక్షణకై ప్రత్యేక చర్యలు తీసుకొనక తప్పదని అన్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు నడక, వ్యాయామం, యోగ వంటివి మన దినచర్యలో భాగం చేసుకోవాలని. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాధులు ఎంతో వేగంగా విస్తరిస్తున్నాయని వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు తగిన ఆరోగ్య సూచనలు పాటిస్తే ఎంతో మంచిదని మనం తీసుకునే అన్ని రకాల ఆహార పదార్థాలలో కల్తీ ఉంటుందని జాగ్రత్తగా తీసుకోవాలని సూచించారు. కొన్ని వ్యాధులకు గతంలో వైద్యం అందుబాటులో ఉండేది కాదని ప్రస్తుత సమాజంలో ఎంతో అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులో కలవని ప్రత్యేకంగా మనకు అందుబాటులో గల ఆరోగ్య భద్రత సద్వినియోగం చేసుకోవాలని 40 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరు ప్రతి మూడు నెలలకు ఒకసారైనా మన ఆరోగ్యం కోసం డాక్టర్లను సంప్రదించి మందులు వాడే దానికంటే ముందు జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిదని సూచించారు.
కార్డియాలజి, ఆర్థోపెడిక్, బీపీ, షుగర్, ఈసీజీ, 2డీఈకో, కంటి పరీక్షలు అనుభవజ్ఞులైన డాక్టర్లచే సిబ్బందికి వైద్యపరీక్షలు నిర్వహించారు. డాక్టర్లు అభిషేక్ కార్డియాలజిస్ట్, ఆర్థోపెడిక్ స్యద్ యసేర్ కుద్రి, అక్బర్ జనరల్ మెడిసిన్, జ్యోతి, గైనకాలజిస్ట్, అరుణ ఎమ్ ఎస్ ఎమ్మెస్ ఆఫ్తాల్మాలజీ, రమేష్ మార్కెటింగ్ మేనేజర్ యశోద హాస్పిటల్, నర్సింగ్ స్టాఫ్ పాల్గొన్నారు. వైద్య సేవలు అందించిన డాక్టర్లకు, మరియు ముఖ్యంగా వైద్య శిబిరాన్ని నిర్వహించడంలో ఉదారత చూపిన యశోద ఆసుపత్రి, శరత్ మాక్స్విజన్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి యాజమాన్యానికి మరియు డాక్టర్లకు ఎస్పీ కృతజ్ఞతలు తెలిపినారు. పోలీసు అధికారులు సిబ్బంది వారు కుటుంబ కుటుంబసభ్యులు 175 మంది వైద్య పరీక్షలు చేయించుకోవడం జరిగినది.
అధికారులకు సిబ్బందికి వారి ఆరోగ్య దృశ్య/సంక్షేమం గురించి యశోద ఆసుపత్రి, శరత్ మాక్స్విజన్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, వారి సౌజన్యంతో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహిస్తామని ఎస్పీ తెలిపారు, అధికారులు సిబ్బంది మెడికల్ క్యాంపు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా వైద్య సిబ్బంది సేవలు గుర్తించి ఎస్పీ వారిని సన్మానించారు.
సిబ్బంది ఆరోగ్యం మరియు సంక్షేమం పట్ల ఎస్పీ తీసుకుంటున్న శ్రద్ధ విశేషమైనదని, ఉచిత మెడికల్ క్యాంప్ ను ఏర్పాటు చేసినందుకు అధికారులు, సిబ్బంది ఎస్పీకి ధన్యవాదాలు తెలిపినారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రాంరెడ్డి, నిర్మల్ డిఎస్పీ ఉపేందర్ రెడ్డి, ఎస్బిఐ ఇన్స్పెక్టర్ రమేష్, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, నిర్మల్ రూరల్ సిఐ వెంకటేష్, ఆర్ఐ వెంకటి, పోలీసు సంఘం అధ్యక్షుడు విరాసత్ అలీ, పోలీస్ సిబ్బంది వారి కుటుంబ సభ్యులు, కార్యాలయ సిబ్బంది, హోంగార్డులు పాల్గొన్నారు.