తడి ,పోడి చెత్తను వేర్వేరుగా ఇవ్వాలి
మున్సిపల్ కమిషనర్ స్వరూప రాణి
జగిత్యాల ఆగస్టు 12
తడి ,పొడి చెత్తను వేర్వేరుగా మున్సిపల్ వాహనానికి ఇవ్వాలని జగిత్యాల మున్సిపల్
కమిషనర్ స్వరూప రాణి సూచించారు.గురువారం నూతన బాధ్యతలు చేపట్టిన జగిత్యాల మున్సిపల్ కమిషనర్ స్వరూప రాణి పట్టణంలోని 8వ వార్డులోని గోత్రాల కాలని, బుడిగా జంగాల కాలనీలో పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కమీషనర్ వార్డు ప్రజలు, మహిళలతో పారిశుధ్య నిర్వహణ పట్ల అవగాహన కల్పించారు.ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వాడకం ప్రభుత్వం,
నిషేధించడం జరిగిందని, నిషేధిత ప్లాస్టిక్ కవర్లు వాడ వద్దని సూచించారు.ప్రతి ఇంటి నుండి వెలువడు చెత్తను తడి, పొడి తోపాటు హానికరమైన చెత్త వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి ఇవ్వాలని ఆన్నారు. అలాగే పట్టణ వాణిజ్య సముదాయలు కూడా 3 బిన్లు ఏర్పాటు చేసుకొని వేరు చేసి మున్సిపల్ వాహనమునకు అందించాలని తెలిపారు. ఏరైన మహిళలలు
చెత్తను బయట వేసిన,ఆ మహిళ ను గుర్తించి తన ద్వారానే చెత్తను తీయించి, మున్సిపల్ వాహనాలు ఇప్పించడం జరుగుతుందని ,అలాగే జరిమానా విధించడం జరుగుతుందని తెలిపారువార్డు మహిళలకు ఇంట్లో వెలువడే తడి చెత్తను ఇంటి వద్దనే హోం కంపోస్టింగ్ చేసుకోవాలని కొరారు.మున్సిపల్ ద్వారా చేసే కుళాయి నీరు నీరు వృధా చేయకుండా చూడాలని , మురికి నీరు బయటకు రోడ్డు పై వదలకుండా మురికి కాలువలకు అనుసంధానం చేయాలని ఎ.ఈ కి ఆదేశించారు. అలాగే పారిశుధ్య జవాన్లు కేత్ర స్థాయిలో విధులు నిర్వహిస్తారని , స్థానిక సమస్యలను గుర్తించి ఎప్పటికపుడు కమిషనర్ దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు.ప్రస్తుత వర్షం కాలంలో సీజన్ వ్యాధులు ప్రబలే ఆవకాశాలు ఉన్నాయిని ,తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని,దోమలు ,ఈగలు వృద్ధి చేందకుండా చూసుకోవాలని సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. పట్టణ అభివృద్ధికి ప్రజలు అందరు సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంట సానిటరీ ఇన్స్పెక్టర్లు మహేశ్వర్ రెడ్డి, అశోక్, అధికారులు రాము, సిబ్బంది ఉన్నారు.